ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ

ABN , First Publish Date - 2023-02-13T00:45:31+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య వంతులను చేయాలని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి సూచించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య వంతులను చేయాలని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి సూచించారు. ఆదివారం మంత్రాలయం ఐటీడీపీ సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మిగనూరులోని తిక్కారెడ్డి స్వగృహం వద్ద నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత టీడీపీ హాయాంలో చంద్రబాబు మంత్రాలయం అభి వృద్ధికి ఎంతో కృషి చేశారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూ చించారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ప్రజల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించారని, కేవం వారు పదవులకోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాం లో కౌతాళంలో తాగునీటి సమస్య, ఆర్డీఎస్‌కు నిధులు మంజూరు, మంత్రాలయం మండలానికి స్కీంలు మంజూరు వంటివి చంద్రబాబు మంజూరు చేశారన్నారు. అలాగే పులికనుమ నుంచి నీరు విడుదల చేయించామన్నారు. టీడీపీ హయాం లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలను చైతన్యం చేయాల న్నారు. క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను సామాన్య ప్రజలకు తెలిసేలా ఐటీడీపీ సభ్యులు పాటుపడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్య మంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేయాలని, మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అం డగా ఉంటానని పార్టీ నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరెడ్డి, దివాకర్‌ రెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ గౌడ్‌, నాయకులు సాల్మాన్‌ రాజు, చావిడి వెంకటేష్‌, జ్ఞానేష్‌, రాబిన్‌శర్మ టీం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-13T00:45:35+05:30 IST