Rahul Gandhi : లడఖ్ పర్యటనలో రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌పై ఆరోపణలు..

ABN , First Publish Date - 2023-08-19T13:22:11+05:30 IST

దేశంలోని అన్ని వ్యవస్థలనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi : లడఖ్ పర్యటనలో రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌పై ఆరోపణలు..
Rahul Gandhi

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని వ్యవస్థలనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారి రాహుల్ లడఖ్‌లో పర్యటిస్తున్నారు. అన్ని వ్యవస్థలనూ ఆరెస్సెస్ నడుపుతోందని, ప్రతి వ్యవస్థలోనూ ఆరెస్సెస్ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని అన్నారు. కేంద్ర మంత్రుల్లో ఎవరిని అడిగినా ఈ విషయాన్ని చెబుతారన్నారు. తమ మంత్రిత్వ శాఖలను వాస్తవంగా నిర్వహిస్తున్నది తాము కాదని, ఆరెస్సెస్ నియమించిన వ్యక్తులే నిర్వహిస్తున్నారని చెబుతారన్నారు. ప్రతి విషయంలోనూ ఆరెస్సెస్ వ్యక్తుల ప్రమేయం ఉంటోందన్నారు.

లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన యువతను కలిశారు. భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం లభించిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ స్వాతంత్ర్యం బలపడిందని చెప్పారు. కొన్ని నిబంధనల సమాహారమే రాజ్యాంగమని చెప్పారు. రాజ్యాంగ దార్శనికతకు అనుగుణంగా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా దానిని అమలు చేయాలన్నారు. కానీ బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం తన సొంత మనుషులను రాజ్యాంగ వ్యవస్థల్లో నియమిస్తోందన్నారు.

అంతకుముందు రాహుల్ గాంధీ లేహ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించారు.


ఇవి కూడా చదవండి :

Udyan Express : ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం..

Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..

Updated Date - 2023-08-19T13:22:23+05:30 IST