Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ

ABN , First Publish Date - 2023-08-16T09:12:18+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జన్మదినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ ఈ ఏడాది 55వ పడిలో అడుగు పెడుతున్నారు.

Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ
Arvind Kejriwal, Narendra Modi

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) జన్మదినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ ఈ ఏడాది 55వ పడిలో అడుగు పెడుతున్నారు.

మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని తెలిపారు.

ఢిల్లీ సర్వీసెస్ చట్టం కారణంగా ఢిల్లీ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ బీజేపీపైన తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. ఢిల్లీ శాసన సభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాడి వేడి వాదోపవాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కేజ్రీవాల్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మాట్లాడినపుడు కూడా ఈ చట్టం గురించి ప్రస్తావించారు. రాష్ట్ర అధికారాన్ని తొలగించడానికి ఎవరు ప్రయత్నించినప్పటికీ, తన పని తాను కొనసాగిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమిలో ఉంది.


ఇవి కూడా చదవండి :

New buses: దీపావళికి 1,000 కొత్త బస్సులు

Metro trains: తిరుచ్చి, సేలంలో మెట్రోరైళ్లు

Updated Date - 2023-08-16T09:13:05+05:30 IST