Tigers : దేశంలో పులుల సంఖ్య పెరిగింది : మోదీ

ABN , First Publish Date - 2023-04-09T15:22:44+05:30 IST

మన దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. 2018లో 2,967 పులులు

Tigers : దేశంలో పులుల సంఖ్య పెరిగింది : మోదీ
Narendra Modi

బెంగళూరు : మన దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. 2018లో 2,967 పులులు ఉండేవని, ఈ సంఖ్య 6.74 శాతం పెరిగి, నేడు 3,167 పులులకు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం కర్ణాటకలోని మైసూరులో ఈ గణాంకాలను ఆయన విడుదల చేశారు.

2006లో 1,411 పులులు, 2010లో 1,706 పులులు, 2014లో 2,226 పులులు, 2018లో 2,967 పులులు ఉండేవని తెలిపారు. 2006తో పోల్చినపుడు ప్రస్తుతం పులుల సంఖ్య 124.45 శాతం పెరిగిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన అమృత కాలంలో పులుల సంఖ్య పెరుగుదలపై విజన్ డాక్యుమెంట్‌ను మోదీ విడుదల చేశారు. రూ.50 స్మారక నాణేన్ని, భారత దేశంలో పులుల అభయారణ్యాల మదింపు నివేదికను కూడా విడుదల చేశారు. పులులు, చిరుతలు, సింహాలు, మంచు చిరుతలు, పూమాలు, జాగ్వార్‌లు వంటి ఏడు రకాల బిగ్ కేట్స్ సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ కేట్ అలయెన్స్‌ను మోదీ ప్రారంభించారు. ఈ కూటమిలో దాదాపు 97 దేశాలు ఉన్నాయి. వాతావరణ మార్పులతో సహా అనేక రకాల ముప్పుల వల్ల ఈ జంతువులు అంతరించిపోకుండా నిరోధించడంపై ఈ కూటమి దృష్టి సారిస్తుంది. ఈ జంతువుల సంరక్షణకు ఆచరించదగిన చర్యలను నిర్ణయిస్తుంది. నిధులను కూడా సమకూర్చుతుంది.

పులుల అభయారణ్యాలు 2006లో 28 ఉండేవని, నేడు వీటి సంఖ్య 51కి పెరిగిందని తెలిపారు. మన దేశంలో పులుల సంరక్షణ కోసం పటిష్టమైన విధానాలను అమలు చేస్తున్నామని, అందువల్ల సింహాల సంఖ్య 29 శాతం పెరిగిందని చెప్పారు. 2020లో గుజరాత్‌లో 674 సింహాలు ఉండేవని, 2015లో వీటి సంఖ్య 523కు పెరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా చిరుత పులుల సంఖ్య 63 శాతం పెరిగిందన్నారు. 2014లో 7,910 చిరుతపులులు ఉండేవని, 2018లో 12,852కు వీటి సంఖ్య చేరిందని తెలిపారు. చీతాలు అంతరించిపోకుండా కాపాడటం కోసం 2022లో విదేశాల నుంచి మన దేశానికి చీతాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా ట్రాన్స్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ జరగడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని తెలిపారు. అస్సాంలో ఒక కొమ్ము ఉన్న రినోసారస్‌ల వేట జరగకుండా నిరోధించగలిగామని చెప్పారు.

ఆస్కార్ అవార్డు పొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీని మోదీ గుర్తు చేశారు. ముదుమలై నేషనల్ పార్క్‌‌ను మోదీ సందర్శించారు.

ఇవి కూడా చదవండి :

Japan: ఇసుకలో మొండెం వరకు కూరుకుపోతున్న జపనీయులు.. ఎందుకో తెలుసా..

Sitaram Yechuri: బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోంది..

Updated Date - 2023-04-09T15:29:19+05:30 IST