Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పాయి నాయకత్వంతో దేశానికి గొప్ప మేలు : మోదీ

ABN , First Publish Date - 2023-08-16T10:06:51+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి, బీజేపీ అగ్ర శ్రేణి నేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పాయి నాయకత్వం వల్ల భారత దేశం గొప్ప ప్రయోజనం పొందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాజ్‌పాయి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు నివాళులర్పించారు.

Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పాయి నాయకత్వంతో దేశానికి గొప్ప మేలు : మోదీ
Atal Bihari Vajpayee, Narendra Modi

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి, బీజేపీ అగ్ర శ్రేణి నేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పాయి (Atal Bihari Vajpayee) నాయకత్వం వల్ల భారత దేశం గొప్ప ప్రయోజనం పొందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. వాజ్‌పాయి వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు నివాళులర్పించారు.

భారత దేశ అభ్యున్నతిని పెంపొందించేందుకు వాజ్‌పాయి విశేష కృషి చేశారని తెలిపారు. అన్ని రంగాలనూ విస్తృత స్థాయిలో 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి ఆయన సేవలు దోహదపడ్డాయన్నారు. వాజ్‌పాయి వర్ధంతినాడు ఆయనకు నివాళులర్పిస్తున్న 140 కోట్లమంది భారతీయుల్లో తాను కూడా ఒకడినని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.

బీజేపీ నుంచి ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి నేత వాజ్‌పాయి. ఆయన పార్టీకి ప్రజాదరణ సాధించడంలో విజయం సాధించారు. ఆరేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన ప్రభుత్వ హయాంలో సంస్కరణలను అమలు చేసి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఆయన 2018 ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో పరమపదించారు.


ఇవి కూడా చదవండి :

New buses: దీపావళికి 1,000 కొత్త బస్సులు

Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ

Updated Date - 2023-08-16T10:06:51+05:30 IST