Pinakini Express: 17, 24, 31 తేదీల్లో గూడూరు వరకే పినాకిని ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2023-10-10T09:28:10+05:30 IST

చెన్నై డివిజన్‌ పరిధిలోని రైలుమార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Pinakini Express: 17, 24, 31 తేదీల్లో గూడూరు వరకే పినాకిని ఎక్స్‌ప్రెస్‌

పెరంబూర్‌(చెన్నై): చెన్నై డివిజన్‌ పరిధిలోని రైలుమార్గాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

- నెం.12711 విజయవాడ-ఎంజీఆర్‌ సెంట్రల్‌ పినాకినిఎక్స్‌ప్రెస్‌ ఈనెల 17, 24, 31తేదీల్లో గూడూరువరకు మాత్రమే నడస్తుండగా, గూడూరు - ఎంజీఆర్‌ సెంట్రల్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే, నెం.12712 ఎంజీఆర్‌ సెంట్రల్‌-విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 17,24,31 తేదీల్లో సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు బదులు సాయంత్రం 4.35గంటలకు గూడూరు నుంచి బయల్దేరుతుంది.

13వరకు బిట్రగుంట-చెన్నై-బిట్రగుంట రైళ్ల రద్దు

- బిట్రగుంట - చెన్నై - బిట్రగుంట (నెం.17237/నెం.12238) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సోమవారం నుంచి ఈ నెల 13వ తేది వరకు పూర్తిగా రద్దు.

రైళ్ల వేళల్లో మార్పులు...

- నెం.12712 ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - విజయవాడ పినానికి ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10వ తేది (మంగళవారం) చెన్నై సెంట్రల్‌ నుంచి 2.05 గంటలకు బదులుగా 45 నిమిషాలు ఆలస్యంగా 2.50 గంటలు, ఈనెల 21, 28 తేదీల్లో 40 నిమిషాలు ఆలస్యంగా 2.45 గంటలకు బయల్దేరుతుంది.

- నెం.12840 చెన్నై సెంట్రల్‌ - హౌరా సూపర్‌ఫాస్ట్‌ మెయిల్‌ ఈ నెల 12, 17, 24, 31 తేదీల్లో ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి రాత్రి 7 గంటలకు బదులుగా 90 నిమిషాలు ఆలస్యంగా 8.30 గంటలు, ఈ నెల 21, 28 తేదీల్లో 40 నిమిషాలు ఆలస్యంగా 7.40 గంటలకు బయల్దేరుతుంది.

ఖమ్మంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‏కు స్టాపింగ్‌

ఎంజీఆర్‌ చెన్నై సెంటల్ర్‌ - న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ సోమవారం నుంచి ఖమ్మం(Khammam) స్టేషన్‌లో ఆగనుంది. నెం.12621 ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ తెల్లవారుజామున 5.24 గంటలకు ఖమ్మం చేరుకొని 5.25 గంటలకు బయల్దేరి వెళ్లనుంది. అలాగే, నెం.12622 న్యూఢిలీ ్ల- చెన్నై సెంట్రల్‌ తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఖమ్మం రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.54 గంటలకు చేరుకొని 8.55 గంటలకు బయల్దేరనుంది.

Updated Date - 2023-10-10T09:30:44+05:30 IST