Nitish Kumar: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన బీహార్ సీఎంకు షాకింగ్ అనుభవం..!

ABN , First Publish Date - 2023-06-15T12:06:45+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) ఉదయపు వాహ్యాళి సమయంలో భద్రతా లోపం జరిగింది. ఆయన గురువారం ఉదయం తన నివాసం నుంచి సర్క్యులర్ హౌసింగ్‌వైపు నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది.

Nitish Kumar: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన బీహార్ సీఎంకు షాకింగ్ అనుభవం..!
Nitish Kumar

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) మార్నింగ్ వాకింగ్ సమయంలో భద్రతా లోపం జరిగింది. ఆయన గురువారం ఉదయం తన నివాసం నుంచి సర్క్యులర్ హౌసింగ్‌ వైపు నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. సర్క్యులర్ రోడ్‌లో ఆయన నడుస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి మోటారు సైకిల్‌పై వచ్చి, భద్రతా వలయాన్ని తప్పించుకుని, సర్క్యులర్ రోడ్‌లోకి ప్రవేశించారు.

నితీశ్ కుమార్ మోర్నింగ్ వాక్ చేస్తున్న మార్గంలోకి ఒక బైకర్ చొచ్చుకెళ్లాడు. దీంతో నితీశ్ తనను తాను కాపాడుకోవడం కోసం రోడ్డుపై నుంచి పుట్‌పాత్ పైకి వేగంగా వెళ్లారు. ఆ బైకర్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా ఎస్ఎస్‌పీలను ముఖ్యమంత్రి నివాసానికి పిలిచారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

ఇవి కూడా చదవండి :

Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం

Cyclone Biparjoy : బిపర్‌జోయ్ తుపాను ప్రభావం.. ద్వారకలోని శ్రీ భడకేశ్వర్ మహాదేవ్ దేవాలయం వద్ద సముద్రం అల్లకల్లోలం..

Updated Date - 2023-06-15T12:39:21+05:30 IST