Khalistan terrorists : సిక్కు ఉగ్రవాదుల దుశ్చర్య.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌కు నిప్పు..

ABN , First Publish Date - 2023-07-04T12:02:58+05:30 IST

సిక్కు ఉగ్రవాదులు భారత దేశ వ్యతిరేకతతో రెచ్చిపోతున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించడం వంటి దురాగతాలకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌కు నిప్పు పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది.

Khalistan terrorists : సిక్కు ఉగ్రవాదుల దుశ్చర్య.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌కు నిప్పు..
San Francisco Indian Consulate

శాన్‌ ఫ్రాన్సిస్కో : సిక్కు ఉగ్రవాదులు భారత దేశ వ్యతిరేకతతో రెచ్చిపోతున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించడం వంటి దురాగతాలకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌కు నిప్పు పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ఈ కాన్సులేట్‌పై మార్చిలో కూడా దాడి జరిగింది. తాజా దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది.

ఖలిస్థాన్ అనుకూల సిక్కు ఉగ్రవాదులు ఆదివారం రాత్రి 1.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడి చేసి, నిప్పు పెట్టారు. కాసేపటికే ఈ మంటలను అగ్నిమాపక శాఖ సిబ్బంది అదుపు చేశారు. ఈ దాడిలో స్వల్ప ఆస్తి నష్టం జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఖలిస్థాన్ మద్దతుదారులు విడుదల చేశారు.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి ఇచ్చిన ట్వీట్‌లో, ఇండియన్ కాన్సులేట్‌పై దాడి, తగులబెట్టే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని విదేశీ దౌత్యవేత్తలపైనా, విదేశీ దౌత్య కార్యాలయాలపైనా దాడులు క్రిమినల్ నేరమని తెలిపారు.

ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం మార్చిలో పంజాబ్‌లో గాలింపు జరిపిన సమయంలో కూడా ఖలిస్థాన్ మద్దతుదారులు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడి చేశారు. అమృత్‌పాల్‌ను స్వేచ్ఛగా వదిలిపెట్టాలని ఈ భవనం గోడలపై రాశారు. కిటికీలు, తలుపులను ఇనుప రాడ్లతో ధ్వంసం చేశారు. ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి :

Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్

Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో

Updated Date - 2023-07-04T12:02:58+05:30 IST