CSK vs PBKS: ఐపీఎల్‌లో నేడు డబుల్ హెడర్.. టాస్ గెలిచిన ధోనీ

ABN , First Publish Date - 2023-04-30T15:15:37+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై

CSK vs PBKS: ఐపీఎల్‌లో  నేడు డబుల్ హెడర్.. టాస్ గెలిచిన ధోనీ

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)-పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతుండగా రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI)-రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడతాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సారథి ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

చెన్నై, పంజాబ్ జట్లు తమ గత మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 32 పరుగులతో ఓడిపోగా, లక్నో చేతిలో పంజాబ్ 56 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఇప్పుడీ మ్యాచ్ చెన్నై సొంత మైదానమైన చిదంబరం స్టేడియంలో జరుగుతుండడం ఆ జట్టుకు కొంత కలిసొచ్చే అంశం. సొంత ప్రేక్షకుల మధ్య ఆడడం ఏ జట్టుకైనా బలమే. మరి ఈ మ్యాచ్‌లో చెన్నై ఆ బలాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.

చెన్నై కనుక ఈ మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకుంటే తిరిగి టాప్ ప్లేస్‌ను అందుకుంటుంది. పంజాబ్ గెలిస్తే దాని స్థానం మెరుగవుతుంది. చెన్నై జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, పంజాబ్ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది.

Updated Date - 2023-04-30T15:15:37+05:30 IST