AAP and Congress : ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.. రాహుల్, ఖర్గేలకు కేజ్రీవాల్ లేఖ..

ABN , First Publish Date - 2023-08-09T12:14:09+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో తమకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు.

AAP and Congress : ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.. రాహుల్, ఖర్గేలకు కేజ్రీవాల్ లేఖ..

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో తమకు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

ఈ బిల్లు విషయంలో తమకు కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని అనేక దశాబ్దాలపాటు గుర్తుంచుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటులో ఓటు వేసినందుకు రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజల తరపున ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. పార్లమెంటు లోపల, వెలుపల ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల సడలని నిబద్ధతను ప్రదర్శించినందుకు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్న శక్తులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ మద్దతివ్వాలని కోరుకుంటున్నామన్నారు.

ఢిల్లీలోని ప్రభుత్వాధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది.

ఇదిలావుండగా, ఈ బిల్లుకు రాజ్యసభలో ఏకైక టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మద్దతిచ్చారు.


ఇవి కూడా చదవండి :

Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..

Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..

Updated Date - 2023-08-09T12:14:09+05:30 IST