Modi surname: ఊహించని పరిణామం... రాహుల్‌కు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2023-03-23T13:50:05+05:30 IST

రాహుల్‌ను పరువు నష్టం కేసులో ఇరికించడం సరికాదని కేజ్రీవాల్ చెప్పారు.

Modi surname: ఊహించని పరిణామం... రాహుల్‌కు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్
Kejriwal supports Congress MP Rahul Gandhi

న్యూఢిల్లీ: మోదీ ఇంటి పేరు(Modi surname) కలవారందరూ దొంగలే అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ సూరత్ కోర్టు (Surat District Court) ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) స్పందించారు. బీజేపీయేతర నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్(Congress) పార్టీతో తమకు విభేదాలున్నాయన్నది నిజమేనని, అయితే రాహుల్‌ను పరువు నష్టం కేసులో ఇరికించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇలా చేస్తారని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు. చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు.

తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ(Congress General Secretary Priyanka Gandhi Vadra) చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ (Chhattisgarh CM Bhupesh Baghel), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Rajasthan CM Ashok Gehlot) కూడా బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు.

మరోవైపు పరువు నష్టం కేసు(defamation case)లో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిందన్నారు.

మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ(BJP MLA Purnesh Modi) కోర్టు తీర్పును స్వాగతించారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ ఇచ్చింది.

Updated Date - 2023-03-23T13:50:08+05:30 IST