Ashok Gehlot: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఇదే గుణపాఠం తప్పదు..

ABN , First Publish Date - 2023-05-13T16:58:11+05:30 IST

జైపూర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దోహదం చేసిందని అన్నారు. రాబోయే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రజలే వారికి (బీజేపీ) తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

Ashok Gehlot: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఇదే గుణపాఠం తప్పదు..

జైపూర్: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి సొంతంగా అధికారం ఏర్పాటు చేయడం ఖాయం కావడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) దోహదం చేసిందని అన్నారు. రాబోయే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రజలే వారికి (BJP) తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ కర్ణాటకలో 'భారత్ జోడో యాత్ర' జరిపినప్పడే చాలా స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఖరారయ్యారని గెహ్లాట్ అన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు సాగించిన ప్రచారం బాగా పనిచేసిందని చెప్పారు. కర్ణాటక ప్రజలు మతతత్వ రాజకీయాలను తోసిపుచ్చి, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ప్రశంసించారు. త్వరలో జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల్లోనూ కర్ణాటక తరహా ఫలితాలే పునరావృతమవుతాయని గెహ్లాట్ జోస్యం చెప్పారు.

Updated Date - 2023-05-13T16:58:37+05:30 IST