Share News

Kiren Rijiju: ముందస్తు వర్ష సూచనల కోసం గూగుల్‌తో ఐఎండీ ఒప్పందం

ABN , Publish Date - Dec 21 , 2023 | 03:26 PM

ముందస్తు వర్ష సూచనల కోసం గూగుల్‌తో ఐఎండీ ఒప్పందం చేసుకుంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( YCP MP Vijayasai Reddy ) అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు ( Kiren Rijiju ) జవాబిచ్చారు. దేశంలో నిర్ధిష్ట ప్రాంతంలో వర్షం పడే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునేందుకు వీలుగా గూగుల్‌ ఆసియా సంస్థతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒప్పందం చేసుకున్నట్లు భూ శాస్త్ర శాఖ మంత్రి కిరెన్‌ రిజుజు తెలిపారు.

Kiren Rijiju: ముందస్తు వర్ష సూచనల కోసం గూగుల్‌తో ఐఎండీ ఒప్పందం

ఢిల్లీ: ముందస్తు వర్ష సూచనల కోసం గూగుల్‌తో ఐఎండీ ఒప్పందం చేసుకుంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( YCP MP Vijayasai Reddy ) అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు ( Kiren Rijiju ) జవాబిచ్చారు. దేశంలో నిర్ధిష్ట ప్రాంతంలో వర్షం పడే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునేందుకు వీలుగా గూగుల్‌ ఆసియా సంస్థతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒప్పందం చేసుకున్నట్లు భూ శాస్త్ర శాఖ మంత్రి కిరెన్‌ రిజుజు తెలిపారు. తుఫాన్లు సంభంచించే సూచనలను మాత్రం యథావిధాగా ఐఎండీనే చేస్తోందని కిరెన్ రిజుజు తెలిపారు. ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌), ఐఎండీ సంయక్తంగా సముద్ర జలాల్లో ఏర్పడే ప్రతికూల పరిస్థితులపై ముందస్తుంగా హెచ్చరికలు జారీ చేస్తుంటాయని కిరెన్ రిజుజు తెలిపారు. సముద్రంలో ఏర్పడే రాకాసి అలలు, సునామీ, తుఫాన్లపై ఐఎండీ ముందస్తు హెచ్చరికలు చేస్తుంటాయని చెప్పారు. సముద్ర జలాల పరిస్థితిపై ప్రతి రోజు ఐఎండీ బులెటిన్లను విడుదల చేస్తుందని ప్రకటించారు. ఈ హెచ్చరికలకు అనుగుణంగా సముద్రంలో సుదీర్గ ప్రాంతాల్లో ఎలాంటి సమాచార వ్యవస్థ అందుబాటులో లేని మత్స్యకారులకు నావిక్‌ మెసేంజిగ్‌ సర్వీస్‌ ద్వారా అలర్ట్‌లు పంపించడం జరుగుతుందని కిరెన్ రిజుజు స్పష్టం చేశారు.

Updated Date - Dec 21 , 2023 | 03:26 PM