Share News

Former CM: జాతీయ రాజకీయాల వైపు కుమారస్వామి.. ప్రధాని సూచనల మేరకేనా..?

ABN , Publish Date - Dec 21 , 2023 | 12:47 PM

రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగనున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్‌ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy)

Former CM: జాతీయ రాజకీయాల వైపు కుమారస్వామి.. ప్రధాని సూచనల మేరకేనా..?

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగనున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్‌ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) జాతీయ రాజకీయాలవైపు వెళతారనే ప్రచారం జోరందుకుంది. బీజేపీ, జేడీఎస్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరిన తరుణంలో కుమారస్వామిని రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు రప్పించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈమేరకు సూచించినట్లు సమాచారం. కుమారస్వామిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రానికి చెందిన బీజేపీ వర్గీయులతో విభేదాలు ఉండవని భావించినట్లు తెలుస్తోంది. జేడీఎ్‌సలో సీనియర్‌నేతగానే కాకుండా రాజకీయాల్లో పట్టుకలిగిన ఉన్నారు. అయనను లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయించి కేంద్రమంత్రిగా అవకాశం కల్పించడం ద్వారా జేడీఎ్‌సతో సుదీర్ఘ పొత్తు కొనసాగించవచ్చునని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ఢిల్లీ నేతల నుంచి కుమారస్వామికి సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ దిశగానే కుమారస్వామి చిక్కబళ్లాపుర నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కుమార వారసుడు నిఖిల్‌ను క్రియాశీలకం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని జేడీఎస్‌ కుటుంబం కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన మేరకు త్వరలోనే కుమారస్వామి ఢిల్లీ వెళ్లి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే సందర్భంలోనే కుమారస్వామి పోటీ చేసే విషయం కూడా ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.

pandu2.2.jpg

Updated Date - Dec 21 , 2023 | 12:47 PM