AadharPAN Linking : ఇంకా మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌‌తో లింక్ చేయలేదా..? మార్చి 31 డెడ్‌లైన్ అని కంగారుపడుతున్నారా..?

ABN , First Publish Date - 2023-03-28T16:09:01+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆధార్, పాన్ సంఖ్యల అనుసంధానానికి గడువు మార్చి 31తో ముగియవలసి ఉందని,

AadharPAN Linking : ఇంకా మీ పాన్ కార్డ్‌ను ఆధార్‌‌తో లింక్ చేయలేదా..? మార్చి 31 డెడ్‌లైన్ అని కంగారుపడుతున్నారా..?
Pan, Aadhar

న్యూఢిల్లీ : శాశ్వత ఖాతా సంఖ్య (PAN), ఆధార్ సంఖ్యల అనుసంధానానికి గడువును కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. అంతకుముందు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ గడువు ఈ నెల 31తో ముగియవలసి ఉంది. ఆధార్ (Aadhar), పాన్ అనుసంధానం జరగకపోతే, జూలై 1 నుంచి పాన్ కార్డులు పని చేయనివి (inoperative) అవుతాయి.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆధార్, పాన్ సంఖ్యల అనుసంధానానికి గడువు మార్చి 31తో ముగియవలసి ఉందని, అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని తెలిపింది. ఈ అనుసంధానం జరగకపోతే జూలై 1 నుంచి పాన్ కార్డులు పని చేయవని తెలిపింది. పని చేయని పాన్ కార్డులు ఉన్నవారికి ఆదాయపు పన్ను రిఫండ్‌లు ఇచ్చేది లేదని, టీడీఎస్, టీసీఎస్‌లను అత్యధిక రేటుతో తగ్గిస్తామని వివరించింది.

ఈ గడువు ముగిసిన తర్వాత ఆధార్-పాన్ అనుసంధానం చేయించాలంటే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను సందర్శించి, రూ.1,000 రుసుము చెల్లించి, అనుసంధానం చేసుకోవచ్చునని తెలిపింది. పాన్‌ను ఈ విధంగా యాక్టివేట్ చేయించుకోవడానికి గడువు 30 రోజులు మాత్రమేనని స్పష్టం చేసింది.

అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు సుమారు 51 కోట్ల పాన్‌లను ఆధార్‌తో అనుసంధానం చేశారు.

ఇవి కూడా చదవండి :

Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థాన్ లింకులు వెల్లడి!

Updated Date - 2023-03-28T16:56:48+05:30 IST