AAP : ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ హైకోర్టులో షాక్

ABN , First Publish Date - 2023-04-06T12:24:54+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyender Jain)కు మనీలాండరింగ్ కేసులో బెయిలు మంజూరు చేసేందుకు ఢిల్లీ

AAP : ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు ఢిల్లీ హైకోర్టులో షాక్
Satyender Jain, Aam Aadmi Party

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyender Jain)కు మనీలాండరింగ్ కేసులో బెయిలు మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఆయనను 2022 మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్ట్ చేసింది, అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

జైన్ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన పలుకుబడిగల వ్యక్తి అని, అందువల్ల ఆయన ఈ కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్తూ, ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో సహ నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్‌లకు కూడా బెయిలును తిరస్కరించింది.

జైన్‌తోపాటు మరికొందరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation-CBI) 2017 ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఆయనకు రూ.1.68 కోట్లు అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 109, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ కేసును నమోదు చేసింది. ఆయన ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది మార్చి 1న మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి :

Padma Awards 2023: కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

RBI MPC Meeting : ఆర్బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం

Updated Date - 2023-04-06T12:24:54+05:30 IST