Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2023-08-21T20:35:50+05:30 IST

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లడఖ్ యాత్ర కొనసాగుతంది. సోమవారం ఆయన లడఖ్‌లోని కర్జుంగ్ లా పాస్‌ను సందర్శించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన మోటారు రోడ్డు మార్గాలలో ఒకటి.

Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

లడఖ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లడఖ్ యాత్ర కొనసాగుతంది. సోమవారం ఆయన లడఖ్‌లోని కర్జుంగ్ లా పాస్‌ను సందర్శించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన మోటారు రోడ్డు మార్గాలలో ఒకటి. ఈ ప్రాంతం లేహ్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది. ష్యోక్, నుబ్రా లోయల గెట్‌వేగా గుర్తింపు పొందింది. కర్దుంగ్ లాకు రాహుల్ గాంధీ బైక్‌పై వెళ్తున్నప్పుడు స్థానికులను కూడా కలిశారు. వారితో ముచ్చటించారు. రాహుల్ గాంధీ ఈ నెల 25 వరకు కర్జుంగ్ లాలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో కార్గిల్ మెమోరియల్‌ని సందర్శించి యువతతో మమేకమవుతారు. ఆగస్టు 25న జరిగే 30 మంది సభ్యుల లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఏహెచ్‌డీసీ)-కార్గిల్ ఎన్నికల సమావేశంలో రాహుల్ కూడా పాల్గొంటారు. కాగా కేటీఎమ్ 390 బైక్‌పై రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రారంభమైన రాహుల్ బైక్ యాత్ర ఈ నెల 25తో ముగియనుంది. ఈ ప్రయాణంలో రాహుల్ గాంధీ అనేక మంది బైక్ రైడర్లు, గిటారిస్టులను కలిశారు. వారితో ముచ్చటించి పలు విషయాలను తెలుసుకున్నారు.


ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ.. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు శనివారం బైక్‌పై లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సును సందర్శించారు. అక్కడే తన తండ్రికి నివాళులర్పించారు. కాగా తన బైక్ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. 5 ఆగష్టు 2019న ఆర్టికల్ 370 మరియు, 35 (ఏ)ని తొలగించి కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ను విభజించిన సంగతి తెలిసిందే. కాగా గత జనవరిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూ, శ్రీనగర్‌లను సందర్శించారు. మళ్లీ ఫిబ్రవరిలో తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా అక్కడే ఉన్న గుల్‌మార్గ్ స్కీ రిసార్ట్‌కు వెళ్లారు.

Updated Date - 2023-08-21T20:35:50+05:30 IST