ట్రాక్‌పై కాంక్రీట్ రాయి.. లోకో పైలెట్ ముందుచూపుతో తప్పిన రైలు ప్రమాదం
ABN , First Publish Date - 2023-06-26T15:48:54+05:30 IST
లోకో పైలెట్ ముందుచూపుతో తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కావేరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రైల్వే ట్రాక్‌పై ఓ కాంక్రీట్ రాయి పడి ఉంది. కావేరీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఇది గమనించి రైలును ఆపాడు. దీంతో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రైలు ఆగింది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై రాయి వేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
లోకో పైలెట్ ముందుచూపుతో తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కావేరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రైల్వే ట్రాక్‌పై ఓ కాంక్రీట్ రాయి పడి ఉంది. కావేరీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ ఇది గమనించి రైలును ఆపాడు. దీంతో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రైలు ఆగింది. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి రైల్వే ట్రాక్‌పై రాయి వేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను సాధారణంగా ట్రాక్ సమీపంలో ఉన్న ఆలయంలో ఉంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆ వ్యక్తి రాత్రి ఒంటి గంట సమయంలో ట్రాక్ దగ్గర కనిపించాడని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఇటీవల ఒడిషాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మూడు రైళ్లు ప్రమాదానికి గురి కావడంతో ఏకంగా 288 మంది చనిపోయారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. దేశ చరిత్రలోని అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ఒకటి, రెండు రైలు ప్రమాదాలు సంభవించాయి.