Smartphones : స్మార్ట్‌ఫోన్ల విషయంలో మోదీ సర్కార్ కీలక ప్రణాళిక !

ABN , First Publish Date - 2023-03-14T15:16:15+05:30 IST

దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాకు గట్టి దెబ్బ తీయడంలో ప్రతి అవకాశాన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం

Smartphones : స్మార్ట్‌ఫోన్ల విషయంలో మోదీ సర్కార్ కీలక ప్రణాళిక !
Pre Installed apps

న్యూఢిల్లీ : దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాకు గట్టి దెబ్బ తీయడంలో ప్రతి అవకాశాన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం వినియోగించుకుంటోంది. స్మార్ట్‌ఫోన్లలో ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను (pre-installed appsను) తొలగించే అవకాశాన్ని కల్పించే విధంగా వాటి తయారీదారులకు ఆదేశాలిచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. అదే విధంగా మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌ను తప్పనిసరిగా పరీక్షించేందుకు అవకాశం ఉండేలా చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు భద్రతాపరమైన నిబంధనలను రూపొందిస్తోంది. ఈ వివరాలను విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.

గూఢచర్యం జరుగుతోందని, యూజర్ల డేటా దుర్వినియోగమవుతోందని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ కొత్త నిబంధనలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. భద్రత దృష్ట్యా ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ పటిష్టమైనవి కాదు. చైనాతో సహా ఇతర దేశాలు దీనిని అనువుగా చేసుకుని గూఢచర్యం వంటివాటికి పాల్పడకుండా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశ భద్రత దృష్ట్యా ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను తొలగించే అవకాశం ఉండేలా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ప్రపంచంలోని స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లలో మన దేశం రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. షియోమీ స్మార్ట్‌ఫోన్‌తోపాటు గెట్‌యాప్స్ యాప్ స్టోర్ వస్తుంది. ఈ ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌ను తొలగించడం సాధ్యం కాదు. శాంసంగ్ తదితర స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇటువంటి యాప్స్ ఉంటాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే శాంసంగ్, షియోమీ, వివో, ఆపిల్ వంటి కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా వీటిలోని ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ వల్ల వ్యాపార నష్టాలు కూడా ఉంటాయి.

చైనా వ్యాపారాలపై భారత ప్రభుత్వం తనిఖీలను 2020 నుంచి పెంచింది. టిక్‌టాక్ సహా సుమారు 300 చైనీస్ యాప్స్‌ను నిషేధించింది. చైనా సంస్థలు మన దేశంలో పెడుతున్న పెట్టుబడులపై కూడా దృష్టి సారించింది. ఇటువంటి చర్యలను ఇతర దేశాలు కూడా చేపడుతున్నాయి. హువావెయి (Huawei), హిక్‌విజన్ (Hikvision) వంటి చైనా కంపెనీల టెక్నాలజీని ఉపయోగించుకోవడంపై చాలా దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ కంపెనీల టెక్నాలజీ ద్వారా చైనా ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతుందనే ఆందోళన వివిధ దేశాల ప్రభుత్వాలను వేధిస్తోంది. అయితే తాము గూఢచర్యానికి పాల్పడటం లేదని చైనా చెప్తోంది.

ఇవి కూడా చదవండి :

Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం

Taliban : భారత్ చర్యతో అవాక్కయిన తాలిబన్లు

Updated Date - 2023-03-14T15:32:19+05:30 IST