BJP: బీజేపీకి బిగ్‌షాక్.. పార్టీకి, పదవికి కీలక నేత గుడ్‌బై
ABN , First Publish Date - 2023-03-10T12:34:30+05:30 IST
శాసనసభ ఎన్నికల తరుణంలో కన్నడ నాట బీజేపీ(BJP)కి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పుట్టణ్ణ(MLC Puttann
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల తరుణంలో కన్నడ నాట బీజేపీ(BJP)కి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పుట్టణ్ణ(MLC Puttanna) అనూహ్యంగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్సీ స్థానానికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం బెంగళూరు కేపీసీసీ కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(KPCC President DK Sivakumar), ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah)లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడు తూ రాష్ట్రంలోని 40 శాతం కమీషన్ వ్యవహారంతో కలత చెంది తాను ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పుట్టణ్ణ కాంగ్రెస్‌లో చేరాలని తీసుకున్న నిర్ణయాన్ని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్వాగతించారు. విద్యారంగానికి పుట్టణ్ణ గణనీయ సేవలందించారన్నారు. పుట్టణ్ణ చేరికతో కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలలో అసంతృప్తి ఉందని పరస్పరం చర్చలతో వారి అనుమానాలు నివృత్తి చేస్తామన్నారు. పుట్టణ్ణ రాకను ప్రతిపక్షనేత సిద్దరామయ్య స్వాగతించారు.
ఇదికూడా చదవండి: వారి భద్రతకు ఏ ఢోకా లేదు..