DGP: వారి భద్రతకు ఏ ఢోకా లేదు..
ABN , First Publish Date - 2023-03-10T11:46:14+05:30 IST
ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం రాష్ట్రానికొచ్చిన వలస కార్మికులకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లోపం లేదని డీజీపీ డా
ప్యారీస్(చెన్నై): ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం రాష్ట్రానికొచ్చిన వలస కార్మికులకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లోపం లేదని డీజీపీ డా.శైలేంద్రబాబు(DGP Dr. Shailendra Babu) పేర్కొన్నారు. కోయంబత్తూర్‌లో గురువారం పరిశ్రమలు నడుపుతున్న యజమానులు, ప్రైవేటు సంస్థల నిర్వాహకులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వలస కార్మికులపై దాడులు కొనసాగుతున్నట్లు నకిలీ వీడియోలను ప్రసారం చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇలాంటి వదంతులను నమ్మరాదంటూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. వదంతులు పుట్టించిన వ్యవహారంలో ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయని, ఇలాంటి చర్యలకు పాల్పడితే జైలుశిక్ష తప్పదని డీజీపీ హెచ్చరించారు.