Share News

Asaduddin Owaisi:బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించిన అసద్.. కాంగ్రెస్‌పై మండిపాటు

ABN , First Publish Date - 2023-11-03T13:50:07+05:30 IST

ఏఐఎంఐఎం(AIMIM) బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు. రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఈ కామెంట్లు చేశారు.

Asaduddin Owaisi:బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించిన అసద్.. కాంగ్రెస్‌పై మండిపాటు

హైదరాబాద్: ఏఐఎంఐఎం(AIMIM) బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు. రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఈ కామెంట్లు చేశారు. తన మతంపై ద్వేషం ఉన్నందునే రాహుల్ తనపై ఇలాంటి ఆరోపణ చేశారని ఓవైసీ ఆరోపించారు. “రాహుల్ గాంధీ(Rahul Gandhi), నా పేరు అసదుద్దీన్ కాబట్టే అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నా ముఖానికి గడ్డం ఉండి.. తలకు టోపీ పెడతాను కాబట్టే నేను డబ్బులు తీసుకున్నానని అంటున్నారు. నా పేరు, గడ్డం, స్కల్ క్యాప్ పై ఆయనకు ఉంది ద్వేషం” అని విమర్శించారు. తెలంగాణలోని కల్వకుర్తిలో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ ఏఐఎంఐఎం పార్టీపై పలు ఆరోపణలు చేశారు. ‘మేం అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, త్రిపుర, తెలంగాణ... ఇలా ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోరాడితే అక్కడ బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఎంఐఎం పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది రాహుల్ గతంలో విమర్శించారు.


‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క బీఆర్‌ఎస్‌(BRS)పై పోరాడడం లేదు. బీఆర్‌ఎస్, బీజేపీ(BJP), ఏఐఎంఐఎంలతో కూడిన త్రయంపై పోరాడుతుంది. తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పార్టీలన్నీ కలిసి ఐక్యంగా పనిచేస్తున్నాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు లేదా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన సొంత వ్యక్తులగా భావిసున్నందన వారిపై సీబీఐ-ఈడీ కేసులు లేవు."అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలనిరెండు నెలల క్రితం బహిరంగంగా సవాల్ చేశారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని మీ నాయకుడికి (రాహుల్‌గాంధీ) నేను సవాల్‌ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉన్నారు. కానీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి నాతో తలపడండి. కాంగ్రెస్‌కు చెందిన వారు చాలా విషయాలు చెబుతారు. కానీ నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదు కూల్చివేశారు’’అని అసుదుద్దీన్ ఓవైసీ అన్నారు. కాగా రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్ విసరడం ఇది మొదటి సారి ఏం కాదు. గతేడాది మేలో ఆయన ఇదే విధమైన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్(Hyderabad) నుంచి పోటీ చేయాలన్నారు. ఈ కామెంట్స్ రెండు పార్టీల మధ్య మాటల మంటలు పుట్టించాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Updated Date - 2023-11-03T13:56:32+05:30 IST