Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ తప్పించుకున్న తీరు ఇదీ...

ABN , First Publish Date - 2023-03-23T19:40:06+05:30 IST

ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) అత్యంత చాకచక్యంగా తప్పించుకుంటున్నట్లు ఓ సీసీటీవీ

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ తప్పించుకున్న తీరు ఇదీ...
Amrit Pal Singh, Punjab

న్యూఢిల్లీ : ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) అత్యంత చాకచక్యంగా తప్పించుకుంటున్నట్లు ఓ సీసీటీవీ ఫుటేజ్‌నుబట్టి తెలుస్తోంది. హర్యానాలోని కురుక్షేత్ర జిల్లా, షహబాద్ ప్రాంతంలో నివసిస్తున్న బల్జీత్ కౌర్ అనే మహిళ ఇంటి నుంచి ఆయన సీసీటీవీ కెమెరా కంటికి చిక్కకుండా తప్పించుకోగలిగారు. అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)కు, ఆయన సహచరుడు పపల్‌ ప్రీత్ సింగ్‌కు ఆశ్రయమిచ్చిన బల్జీత్ కౌర్‌ను హర్యానా పోలీసులు (Haryana Police) అరెస్ట్ చేశారు.

అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వరుసగా ఆరో రోజు గురువారం కూడా గాలింపు జరుపుతున్నారు. మొదటి రోజు 50కి పైగా వాహనాల్లో ఆయనను పోలీసులు వెంటాడారు. అయినప్పటికీ వారి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. ఆయన దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లు కొందరు అనుమానిస్తున్నారు. ఆయన పంజాబ్ నుంచి తప్పించుకోగలిగినట్లు కనిపిస్తోంది.

హర్యానాలోని కురుక్షేత్ర పోలీసు సూపరింటెండెంట్ సురీందర్ సింగ్ భోరియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, షహబాద్ ప్రాంతంలో నివసిస్తున్న బల్జీత్ కౌర్ అనే మహిళను తాము అరెస్ట్ చేశామని చెప్పారు. ఆమె తన ఇంట్లో అమృత్‌పాల్ సింగ్, ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్‌లకు ఆదివారం ఆశ్రయం ఇచ్చారని తెలిపారు. ఆమెను పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

ఇదిలావుండగా, బల్జీత్ కౌర్ ఇంటి నుంచి అమృత్‌పాల్ సింగ్ సోమవారం ఓ గొడుగు దరించి, చేతిలో చిన్న సంచీతో నడుచుకుంటూ వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఆయన తెల్లని చొక్కా, ముదురు నీలం రంగు జీన్స్ ధరించినట్లు కనిపించింది.

అమృత్‌పాల్ సింగ్ గత శనివారం 12 గంటల్లో ఐదు వాహనాలను మార్చి తప్పించుకుపోయారు. పంజాబ్ పోలీసులు గురువారం అమృత్‌పాల్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిలో ఒకరైన తేజిందర్ సింగ్ గిల్‌ను అరెస్ట్ చేశారు. అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడిలో ఈయన కూడా పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi Vs Rajnath Singh : రాహుల్ గాంధీకి శిక్షపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

Vijay Mallya : విజయ్ మాల్యా కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు

Updated Date - 2023-03-23T19:40:06+05:30 IST