Covid Outbreat : కోవిడ్-19 వైరస్ ప్రారంభంపై అనుమానాలు.. వూహన్ ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికా నిధుల నిలిపివేత..

ABN , First Publish Date - 2023-07-19T09:42:03+05:30 IST

చైనాలోని వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (Wuhan Institute of Virology)కి అమెరికా ఫెడరల్ ఫండింగ్‌ను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ (Joe Biden administration) నిలిపేసింది. ఇక్కడి ప్రయోగశాలలో భద్రతా చర్యల అమలు గురించి సరైన పత్రాలను సమర్పించడంలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకుంది.

Covid Outbreat : కోవిడ్-19 వైరస్ ప్రారంభంపై అనుమానాలు.. వూహన్ ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికా నిధుల నిలిపివేత..

వాషింగ్టన్ : చైనాలోని వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (Wuhan Institute of Virology)కి అమెరికా ఫెడరల్ ఫండింగ్‌ను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ (Joe Biden administration) నిలిపేసింది. ఇక్కడి ప్రయోగశాలలో భద్రతా చర్యల అమలు గురించి సరైన పత్రాలను సమర్పించడంలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకుంది. ఈ సంస్థ నుంచే కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన వైరస్ బయటకు వచ్చిందనే అనుమానాలు రావడంతో దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.

వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి అమెరికా ఆరోగ్య, మానవ సేవల శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంస్థ చేపట్టిన భద్రతా చర్యలపై గత ఏడాది సెప్టెంబరు నుంచి దర్యాప్తు జరుగుతోంది. ఈ సంస్థ ఫెడరల్ రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా పని చేయడం లేదు. అందువల్ల ఈ సంస్థకు ఇకపై ఫెడరల్ ఫండింగ్ (నిధులు) ఇవ్వబోవడం లేదు.

కోవిడ్-19 మహమ్మారి ఎక్కడి నుంచి ప్రారంభమైందనే అంశంపై దర్యాప్తు జరుగుతోంది. చైనాలో అమలవుతున్న జీవ సంబంధ భద్రతా చర్యలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి జరిమానా విధించడం అమెరికా తీసుకున్న చాలా ముఖ్యమైన చర్య. 2020 జూలై నుంచి అమెరికన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నుంచి కూడా ఈ ప్రయోగశాలకు నిధులు అందడం లేదు.

కోవిడ్-19 మహమ్మారికి కారణమైన వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే ఈ వైరస్ బయటపడిందని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ క్రిస్టఫర్ రే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకిందా? లేదంటే ప్రయోగశాలలో జరిగిన ప్రమాదం వల్ల ఈ మహమ్మారి వ్యాపించిందా? అనే అంశాన్ని అమెరికా స్పష్టంగా నిర్థరించలేదు.

అమెరికా తాజా నిర్ణయంతో ఈ ప్రయోగశాల ఇకపై అమెరికాతో ఎటువంటి వ్యాపారాన్ని నిర్వహించడం సాధ్యంకాదు. ఇతరుల ఏజెంట్‌గా కానీ, ప్రతినిధిగా కానీ అమెరికాతో వ్యాపారం చేయడానికి వీలు కాదు. ఈ సస్పెన్షన్, ప్రతిపాదిత డిబార్మెంట్‌లను ఈ ప్రయోగశాల సవాల్ చేయవచ్చు, కానీ అలా సవాల్ చేయకపోవచ్చునని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Vande Bharat Train: వందే భారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

సైనిక పరికరాల సంయుక్త ఉత్పత్తికి భారత్‌, ఫ్రాన్స్‌ అంగీకారం

Updated Date - 2023-07-19T09:42:03+05:30 IST