Vande Bharat Train: వందే భారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

ABN , First Publish Date - 2023-07-19T07:34:19+05:30 IST

చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య వందే భారత్‌ రైలు సేవలను ఆగస్టు 15వ తేదిలోగా ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ జ

Vande Bharat Train: వందే భారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

- ఆగస్టు 15లోపు ప్రారంభం

ప్యారీస్‌(చెన్నై): చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య వందే భారత్‌ రైలు సేవలను ఆగస్టు 15వ తేదిలోగా ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలను కలిపే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ‘వందే భారత్‌’ తొలి సేవలు గత 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ-వారణాసి మధ్య ప్రారంభమైందని, రాష్ట్రంలో మొదటి వందే భారత్‌ రైలు(Vande Bharat Train) చెన్నై సెంట్రల్‌ - కోయంబత్తూర్‌ల మధ్య ఏప్రిల్‌ 8వ తేది నుంచి ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలు కలిపే రీతిలో చెన్నై నుంచి తిరునల్వేలికి వందే భారత్‌ రైలు నడిపేందుకు రైల్వే బోర్డు నిర్ణయించిందని, ప్రస్తుతం ఈ మార్గంలో దానికి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రస్తుతం 10 గంటల వ్యవధిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నామని, వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తే ఎనిమిది గంటల్లో గమ్యస్థానం చేరుకోవచ్చన్నారు. తిరునల్వేలి నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరే వందే భారత్‌ రైలు మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైకి చేరుకుంటుందని, అలాగే, ఇక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుందన్నారు. ఈ రైలు తిరుచ్చి, దిండుగల్‌, మదురై తదితర మూడు రైల్వేస్టేషన్లలో ఆగుతుందని ఆర్‌ఎన్‌ సింగ్‌ తెలిపారు.

Updated Date - 2023-07-19T07:34:19+05:30 IST