Gyanvapi : జ్ఞానవాపిలో ప్రార్థన చేసే హక్కు.. ఐదుగురు మహిళల పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు..

ABN , First Publish Date - 2023-05-31T17:20:16+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి శృంగార గౌరి ఇతర దేవీదేవతలకు నిత్యం పూజలు చేసేందుకు

Gyanvapi : జ్ఞానవాపిలో ప్రార్థన చేసే హక్కు.. ఐదుగురు మహిళల పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు..
Gyanvapi mosque

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి (Gyanvapi) శృంగార గౌరి (Shringar Gauri), ఇతర దేవీదేవతలకు నిత్యం పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన దావాకు విచారణార్హత ఉందని అలహాబాద్ హైకోర్టు (Allahabad high court) బుధవారం స్పష్టం చేసింది. అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ (AIMC) దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఐదుగురు హిందూ మహిళలు ప్రార్థన చేసే హక్కును కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై తమ అభ్యంతరాలను వారణాసి కోర్టు తోసిపుచ్చడాన్ని ఈ సివిల్ రివిజన్ పిటిషన్‌లో ఏఐఎంసీ సవాల్ చేసింది. జస్టిస్ జేజే మునీర్ విస్తృతంగా వాదనలను విన్న తర్వాత ఈ అభ్యంతరాలను తోసిపుచ్చారు.

న్యాయవాది సుభాశ్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ, ఇది హిందూ పక్షానికి ఘన విజయమని చెప్పారు. ఏఐఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. హిందూ పక్షం తరపున వాదనలు వినిపించిన మరో న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ, ఇది చరిత్రాత్మక తీర్పు అని చెప్పారు. మసీదు కమిటీ పిటిషన్‌కు విచారణార్హత లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.

జ్ఞానవాపికి సంబంధించిన ఏడు కేసులపై బుధవారం విచారణ జరిగింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని ఓ దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వారణాసి కోర్టు (Varanasi court) 2021 ఏప్రిల్ 8న విచారణ జరిపింది. మసీదు కాంప్లెక్స్‌ను సమగ్రంగా సర్వే చేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి :

NIA Raids : దక్షిణ కన్నడలో ఎన్ఐఏ సోదాలు

https://www.andhrajyothy.com/2023/national/nia-raids-16-locations-related-to-banned-pfi-members-in-karnataka-yvr-1077166.html

Rahul Gandhi : మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే.. : రాహుల్ గాంధీ

https://www.andhrajyothy.com/2023/national/if-modi-sat-down-with-god-he-will-explain-about-how-universe-works-says-rahul-gandhi-yvr-1077147.html

Updated Date - 2023-05-31T17:20:16+05:30 IST