Kannada Star: బీజేపీలో చేరనున్న సినీస్టార్ కిచ్చా సుదీప్

ABN , First Publish Date - 2023-04-05T07:23:43+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం స్వీకరించనున్నారు....

Kannada Star: బీజేపీలో చేరనున్న సినీస్టార్ కిచ్చా సుదీప్
Kannada Star Kiccha Sudeep

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం స్వీకరించనున్నారు. ప్రముఖ కన్నడ సినీ నటులు సుదీప్ (కిచ్చా సుదీప్)(Kannada Star Kiccha Sudeep), దర్శన్ తూగుదీప బుధవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు ((Join BJP)కమలనాథులు ప్రకటించారు.కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నటుడు సుదీప్ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఇతర పార్టీ నేతల సమక్షంలో కిచ్చా సుదీప్, దర్శన్ తూగుదీప పార్టీలో చేరనున్నారు.

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరు సినీనటులు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు పార్టీలో చేరనున్నారు.మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Polls) జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Updated Date - 2023-04-05T07:44:33+05:30 IST