Share News

Ayodhya: రామయ్య కోసం అయోధ్యకు 600 కేజీల నెయ్యి పంపిన గోశాల అధిపతి

ABN , First Publish Date - 2023-11-29T13:12:37+05:30 IST

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరంలో వచ్చే ఏడాది జనవరిలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కోసం జోధ్‌పూర్ నుంచి 600 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని అయోధ్యకు పంపారు.

Ayodhya: రామయ్య కోసం అయోధ్యకు 600 కేజీల నెయ్యి పంపిన గోశాల అధిపతి

జోధ్‌పూర్: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరంలో వచ్చే ఏడాది జనవరిలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కోసం జోధ్‌పూర్ నుంచి 600 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని అయోధ్యకు పంపారు. ఈ నెయ్యి మోసుకెళ్లడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 108 కలశాలలను 11 రథాలపై సోమవారం పంపించారు. దేవ్ దీపావళి రోజున శ్రీశ్రీ మహరిష్ సాందీపని రామ్ ధర్మ గోశాల నుంచి ‘జై శ్రీరామ్’ అనే మంత్రోచ్ఛరణాల మధ్య పంపారు. అయోధ్య ఆలయంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన సందర్భంగా జరిగే హారతి, హవనంలో ఈ 600 కిలోల నెయ్యి ఉపయోగిస్తామని రథాలతో పాటు వచ్చిన గోశాల అధిపతి సాందీపని మహారాజ్ తెలిపారు. "సోమవారం గోశాల నుంచి పదకొండు ప్రత్యేక రథాలను తీసుకొచ్చాం. ఈ రథాలను గత ఆరు నెలలుగా గోశాలలో సిద్ధం చేశాం. ఒక్కో రథం తయారీకి రూ.3.5 లక్షలు ఖర్చు చేశాం. ఆ రథాల్లోని 108 ఉక్కు కలశాలలో మొత్తం 600 కిలోల నెయ్యి ఉంది. ఈ నెయ్యిని శ్రీరాముని మొదటి హారతి, హవానంలో ఉపయోగించడానికి ప్రత్యేకంగా తయారు చేశాం. దీనిని గత తొమ్మిది సంవత్సరాలలో చాలా జాగ్రత్తగా తయారు చేయశాం." అని సాందీపని మహారాజ్ చెప్పారు.


‘‘ఒకే కలశంతో ఒక మహా రథాన్ని తయారు చేయాలని మొదట నిర్ణయించాం. తద్వారా ఒక్కో కలశం కోసం 108 రథాలు ఉండేలా ప్రణాళిక చేశాం. అలా మొత్తం 108 రథాలు ఉండాలనేది మా ఆకాంక్ష. కానీ సమయాభావం, మధ్యలో ఎన్నికలు రావడంతో 97 సింబాలిక్ రథాలతో 11 రథాలను మాత్రమే సిద్ధం చేశాం.’’ అని ఆయన తెలిపారు. కాగా జోధ్‌పూర్‌లోని గోశాలలో తయారుచేసిన నెయ్యిని అయోధ్యలోని రామ మందిరానికి తీసుకెళ్తామని సాందీపని చాలా కాలం క్రితం తీర్మానం చేశారు. ఆలయ నిర్మాణంతో ఈ తీర్మానం మరింత బలపడింది. జోధ్‌పూర్‌కు చెందిన బృందం శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ అధికారులను కలిసి మహారాజ్ తీర్మానాన్ని తెలియజేసినట్లు వీహెచ్‌పీ ఆఫీస్ బేరర్ మహేంద్ర సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. దీంతో ట్రస్టుకు చెందిన బృందం గోశాలను సందర్శించి నెయ్యిని తనిఖీ చేసింది. గోశాలలోని నెయ్యిని తీసుకోవడానికి అంగీకరించింది.

Updated Date - 2023-11-29T14:08:01+05:30 IST