Sikkim: సిక్కిం వరదల్లో 55కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా లభించని 141 మంది ఆచూకీ

ABN , First Publish Date - 2023-10-08T13:14:05+05:30 IST

సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

Sikkim: సిక్కిం వరదల్లో 55కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా లభించని 141 మంది ఆచూకీ

గ్యాంగ్ టక్: సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సిక్కిం(Sikkim)లో 27, పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో మిగతా మృతదేహాలు లభ్యమైనట్లు ఆర్మీ(Indian Army) అధికారులు వెల్లడించారు. తీస్తా నదీ(Teesta River) పరీవాహక ప్రాంతంలో లొనాక్ సరస్సుపై క్లౌడ్ బరస్ట్ వల్ల సంభవించిన వరదల కారణంగా 8 మంది ఆర్మీ అధికారులతో సహా.. 55 మంది పౌరులు మరణించారు. 140 మందికి పైగా గల్లంతయ్యారు.


వారి ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SSDMA) సుమారు 2 వేల 413 మందిని రక్షించామని, ఆకస్మిక వరదలలో వెయ్యికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు 25 వేలకు పైగా ప్రజలు విపత్తు బారిన పడ్డారని, 6 వేల 875 మందిని సహాయక శిబిరాలకు తరలించామని తెలిపింది. వరదల ధాటికి భారీగా ఆస్తి నష్టం(Property Damage) జరిగింది. ఈ పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌(Prem Singh Tamang)తో హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఆదివారం ఉదయం సమావేశమయ్యారు. సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను, మంగన్‌లోని నాగా గ్రామంలోని సహాయక శిబిరాలను సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు. జవాన్ల మృతిపై భారత సైన్యం శనివారం సంతాపం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-10-08T14:06:38+05:30 IST