Share News

Rishi Sunak: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో ఇజ్రాయెల్ వెంటే బ్రిటన్: రిషీ సునక్

ABN , First Publish Date - 2023-10-19T14:39:46+05:30 IST

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాడుతోందని ఈ పోరులో ఇజ్రాయెల్(Israeil) వెంట బ్రిటన్ ఎల్లప్పుడూ ఉంటుందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్(Rishi Sunak) స్పష్టం చేశారు. ఆ దేశ పర్యటనలో భాగంగా రిషి ఇవాళ ఎక్స్(X)లో ఓ పోస్ట్ పెట్టారు. 'నేను ఇజ్రాయెల్ లో ఉన్నాను. ఈ దేశం ప్రస్తుతం బాధలో ఉంది. ఉగ్రవాదం(Terrorism)తో పోరాడుతోంది. ఈ పోరాటంలో బ్రిటన్ ఇజ్రాయెల్ కు ఎప్పుడూ అండగా ఉంటుంది' అని పోస్ట్ లో రాశారు.

Rishi Sunak: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో ఇజ్రాయెల్ వెంటే బ్రిటన్: రిషీ సునక్

జెరూసలెం: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాడుతోందని ఈ పోరులో ఇజ్రాయెల్(Israeil) వెంట బ్రిటన్ ఎల్లప్పుడూ ఉంటుందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్(Rishi Sunak) స్పష్టం చేశారు. ఆ దేశ పర్యటనలో భాగంగా రిషి ఇవాళ ఎక్స్(X)లో ఓ పోస్ట్ పెట్టారు. 'నేను ఇజ్రాయెల్ లో ఉన్నాను. ఈ దేశం ప్రస్తుతం బాధలో ఉంది. ఉగ్రవాదం(Terrorism)తో పోరాడుతోంది. ఈ పోరాటంలో బ్రిటన్ ఇజ్రాయెల్ కు ఎప్పుడూ అండగా ఉంటుంది' అని పోస్ట్ లో రాశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) టెల్ అవీవ్ లో పర్యటించిన మరుసటి రోజు రుషి సునక్ ఇజ్రాయెల్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హమాస్ వల్ల వందల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజల్ని కోల్పోయిందని వారి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు తమ వంతు సాయంగా ఆయుధాల్ని అందించి దాడులు తీవ్రతరం అయ్యేలా చూస్తామని సునక్ స్పష్టం చేశారు. అదే టైంలో గాజాలోని ఓ ఆసుపత్రిపై బాంబులతో దాడులు చేయడంపై సునక్ స్పందించారు.


ఆ ప్రాంత ప్రజలకు మానవతా సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడ నివసిస్తున్న బ్రిటన్(Britan) పౌరుల్ని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామన్నారు. యుద్ధంతో రెండు దేశాల్లో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ వైపు 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ భయంతో 10 లక్షలకు పైగా ప్రజలు గాజాను వీడిచి వెళ్లిపోయారు. గాజా(Gaza) ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. నిన్న ఆయన ఇజ్రాయెల్(Israeil) లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్(Tel Aviv) లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న టెల్ అవివ్ ప్రాంతాన్ని బైడెన్ సందర్శించారు. హమాస్ 31 మంది అమెరికన్లతో సహా 13 వందల మందిని హత్య చేసిందని ఆయన ఆరోపించారు. వారు పిల్లలతో సహా అనేక మందిని బందీలుగా పట్టుకున్నారని చెప్పారు. హమాస్ పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని కొత్త చిక్కులను తీసుకువచ్చిందని ఆయన అన్నారు. తమ వెంట ఉన్నందుకు బైడెన్ కి నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. "నాజీలను ఓడించడానికి నాగరిక ప్రపంచం ఏకం అయినట్లే, ఐఎస్‌ఐఎస్‌(ISIS)ను ఓడించడానికి ఏకమైనట్లే, హమాస్‌ను ఓడించడానికి నాగరిక ప్రపంచం ఏకం అయి ప్రపంచ శాంతి కోసం క‌ృషి చేయాలి" అని బైడెన్

Updated Date - 2023-10-19T14:39:46+05:30 IST