Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2023-05-12T17:00:42+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (former Pakistan Prime Minister Imran Khan)కు ఇస్లామాబాద్ హైకోర్టులో శుక్రవారం ఊరట

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట
Imran Khan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (former Pakistan Prime Minister Imran Khan)కు ఇస్లామాబాద్ హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. అల్ కదిర్ ట్రస్ట్ కేసులో ఆయనకు రెండు వారాల బెయిలు మంజూరైంది. ఆయనను మంగళవారం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. కోర్టు ఆవరణలో ఆయనను అరెస్ట్ చేయడం చెల్లదని, ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద ఇమ్రాన్ ఖాన్ విలేకర్లతో మాట్లాడుతూ, తనను ఎన్ఏబీ అధికారులు బాగానే చూసుకున్నారని, అయితే తనను అరెస్ట్ చేసేటపుడు తన తలపై కొట్టారని చెప్పారు. తన సతీమణి బుష్ర బీబీతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని ఎన్ఏబీ అధికారులను కోరానని, అందుకు వారు స్పందించి ల్యాండ్‌లైన్ ఫోన్లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చారని చెప్పారు.

దేశంలో జరుగుతున్న నిరసనల గురించి ప్రస్తావిస్తూ, వీటిని తాను ఎలా ఆపగలనని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేస్తే ప్రతిస్పందన వస్తుందని ముందుగానే చెప్పానన్నారు. తనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత తాను ఏ విధంగా బాధ్యుడినవుతానని ప్రశ్నించారు.

ఇస్లామాబాద్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఇమ్రాన్ ఖాన్‌కు రెండు వారాల బెయిలు మంజూరు చేసింది. జస్టిస్ మియాన్‌గుల్ హసన్ ఔరంగజేబ్, జస్టిస్ సమన్ రఫత్ ఇంతియాజ్ డివిజన్ బెంచ్ అల్ కదిర్ ట్రస్ట్ కేసులో ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇమ్రాన్ (70) శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హైకోర్టుకు హాజరయ్యారు. బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్, ఇతర లాంఛనాలను పూర్తి చేశారు. భద్రతా కారణాల వల్ల విచారణను దాదాపు 2 గంటలపాటు నిలిపేశారు. అంతకుముందు ఓ న్యాయవాది కోర్టు గదిలో ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇద్దరు న్యాయమూర్తులు అసహనం ప్రదర్శిస్తూ, కోర్టు గది నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత విచారణ పునఃప్రారంభమవుతుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!

Karnataka election : ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ సిద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సైగలు..

Updated Date - 2023-05-12T17:01:54+05:30 IST