Heart Health: హార్ట్ ఆపరేషన్ తర్వాత ఏ ఫుడ్ తింటే.. ఏమౌతుందో అనే ఆందోళనలో ఉన్నారా..? డోంట్ వర్రీ..

ABN , First Publish Date - 2023-04-01T13:40:51+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మొత్తం హృదయ సంబంధింత మరణాలలో 85% గుండెపోటు, స్ట్రోక్‌ల కారణంగానే సంభవిస్తాయి.

Heart Health: హార్ట్ ఆపరేషన్ తర్వాత ఏ ఫుడ్ తింటే.. ఏమౌతుందో అనే ఆందోళనలో ఉన్నారా..? డోంట్ వర్రీ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. మొత్తం హృదయ సంబంధింత మరణాలలో (CVD) 85% గుండెపోటు, స్ట్రోక్‌ల కారణంగానే సంభవిస్తాయి. కార్డియో వాస్కులర్ వ్యాధుల్లో(CVD).. గుండె, రక్త నాళాల లోపాలు, కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాస్కులర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ వంటివి ఉన్నాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్ మెల్లిటస్, అధిక కొలెస్ట్రాల్, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా వీటి నుంచి బయట పడాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు తప్పనిసరి. గుండె శస్త్రచికిత్స అనంతరం వైద్యులు ఆహారంలో మార్పులను సూచిస్తారు. సర్జరీ తర్వాత మంచిగా కోలుకోవాలంటే.. ఫుడ్‌లో మార్పులు తప్పనిసరి. ఆపరేషన్ తర్వాత కొద్ది రోజుల పాటు ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉండాలంటే ఇంటి ఫుడ్ తీసుకోవడం తప్పనిసరి. ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన ఫుడ్ విషయంలో మనకు కొన్ని అపోహలు అయితే ఉండొచ్చు.

అపోహ : కొన్ని ‘సూపర్ ఫుడ్స్’ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

వాస్తవం: సూపర్ ఫుడ్ అనేదే లేదు. షాక్ అవకండి. ఇది నిజం. అయితే.. బ్లూబెర్రీస్, దానిమ్మ పండ్లు, వాల్‌నట్స్, చేపలు వంటి ఆహారాలు మీ టిక్కర్‌కు మంచివి. కానీ.. గుండె జబ్బులు రాకుండా అయితే నిరోధించలేవు. పలు అధ్యయనాల ప్రకారం.. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, కూరగాయలు, పండ్లు, ఆలివ్ నూనె వంటి మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ కలిగిన మెడిటరేనియన్ ఆహారం, వారానికి ఒకసారి చేపలు లేదా పౌల్ట్రీ చికెన్ వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. రెడ్ మీట్‌లో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నందున దానిని తినకపోవడం బెటర్.

అపోహ: ఫ్యాట్స్ అనేవి మన ఆరోగ్యానికి మంచివి కావు..

వాస్తవం: మన శరీరానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. మన మెదడుతో పాటు కొన్ని కండరాలకు కొలెస్ట్రాల్ ఇందనంగా అవసరం. మనకు కొలెస్ట్రాల్ అవసరం కానీ ఎంత మేరకు అవసరమనేదే ముఖ్యం. ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తప్పనిసరిగా నివారించాలి. ఇది మాత్రమే కాకుండా.. కూల్ డ్రింక్స్ వంటి అధిక చక్కెర ఆహారాలు కూడా గుండెకు హానికరం అని అధ్యయనాలు తేల్చాయి. రెడ్, మీట్, వెన్న వంటి జంతు ఉత్పత్తుల నుంచి తీసుకోబడిన శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా LDL స్థాయిలను పెంచుతాయి. ప్రాసెస్ చేయని ఆహారం లేదంటే నేచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు.

Updated Date - 2023-04-01T13:40:51+05:30 IST