Kidney Health: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి అనిపించినా మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్టే..!

ABN , First Publish Date - 2023-04-03T10:18:19+05:30 IST

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులకు భారతదేశంలో కొదువేం లేదు. ఇటీవలి కాలంలో ప్రతి పది మందిలోనూ ఒకరు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు. శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్‌ చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.

Kidney Health: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి అనిపించినా మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్టే..!

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులకు భారతదేశంలో కొదువేం లేదు. ఇటీవలి కాలంలో ప్రతి పది మందిలోనూ ఒకరు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు. శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్‌ చేయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలోని పీహెచ్ స్థాయి, ఉప్పు, పొటాషియం మొత్తాన్ని కిడ్నీలే నియంత్రిస్తాయి. మూత్రపిండాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించడానికి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మొత్తం శరీరానికి ఆక్సిజన్‌ను తీసుకువెళతాయి. కిడ్నీ వ్యాధులను సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తారు.

ఈ లక్షణాలు ఉన్నాయో..

కిడ్నీ సమస్యలు సిగ్నల్ లేకుండా సడెన్‌గా బయటపడతాయి. ప్రమాదాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే.. అవి దీర్ఘకాలికంగా మారవచ్చు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కిడ్నీ బాధిత 90 శాతం మంది రోగులలో చివరి దశ వరకూ ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ప్రారంభ దశలో నిశ్శబ్దంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సీరం క్రియేటినిన్, యూరిన్ అల్బుమిన్ డిటెక్షన్ వంటి పరిశోధనల సహాయంతో దీనిని నిర్ధారించవచ్చు. ఇక ఆ తరువాత దశలలో, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న రోగులకు శరీరం మొత్తం వాపు, మూత్రం నురుగు మాదిరిగా రావడం.. కొన్నిసార్లు రక్తం పడటం వంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వీరికి ముప్పు ఎక్కువ..

అలాగే అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం ఉన్న రోగులు ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా కిడ్నీ పనితీరును తనిఖీ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముందస్తు ఏవైనా సూచనలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్‌‌తో బాధపడుతున్నవారు, హై బీపీ ఉన్నవారు లేదంటే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి సంబంధించిన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు ఎక్కువ కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

Updated Date - 2023-04-03T11:10:51+05:30 IST