Share News

Dates: రోజూ ఖర్జూరం తింటే జరిగేదేంటి? ఈ కారణాల లిస్ట్ చూస్తే..!

ABN , Publish Date - Dec 27 , 2023 | 12:39 PM

ఖర్జూరాలలో తీపి రుచి కారణంగా ఇవంటే అందరికీ ఇష్టం. కానీ వీటిని రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలివీ..!

Dates: రోజూ ఖర్జూరం తింటే జరిగేదేంటి? ఈ కారణాల లిస్ట్ చూస్తే..!

ఖర్జూరాన్ని సహజంగా డ్రై ఫ్రూట్స్ లో భాగంగా తీసుకుంటారు. తీపి రుచిని కలిగిన కారణంగా దీన్ని తినడానికి అందరూ ఇష్టపడతారు. వీటిలో పోషకాలు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉన్న కారణంగా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే ఖర్జూరాలను అప్పుడప్పుడు తినడమే తప్ప రోజూ తినేవారు తక్కువగానే ఉంటారు. ప్రతిరోజూ ఖర్జూరాలను తినడం వల్ల కింది ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.

పోషకాలకు పవర్ హౌస్..

ఖర్జూరాలలో విటమిన్-బి, కె సమృద్దిగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, రాగి వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఫైబర్‌తో సహా బోలెడు పోషకాలు ఇందులో ఉంటాయి. ఖర్జూరాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలను సులువుగా భర్తీ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: వెల్లుల్లి పొట్టు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే!


ఎనర్జీ బూస్టర్..

ఖర్జూరాలు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లతో సహా వివిధ చక్కెరలతో నిండి ఉంటాయి.ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పగటిపూట తక్షణ శక్తి అవసరమయ్యే వ్యక్తులకు ప్రాసెస్ చేయబడిన ఆహారాలకంటే ఖర్జూరాలు ది బెస్ట్ ఎంపిక. ఖర్జూరాలలోని సహజ చక్కెరలు ఫైబర్‌తో కలిసి ఉంటాయి, ఇది చక్కెర గ్రహించే సామర్థ్యాన్ని నియంత్రిస్తుంది. శరీరంలో అకస్మాత్తుగా చక్కెర స్థాయి పెరగడం, తగ్గడం జరగదు.

ఎముకల ఆరోగ్యం..

ఖర్జూరంలో భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి, ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలు ఏర్పడటమే కాకుండా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బ్రతకాలనుందా? ఈ సింపుల్ టిప్స్ తో ఆయుష్షు ఫుల్!


జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

ఫైబర్ కంటెంట్‌ మెరుగ్గా ఉన్న కారణంగా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రేగు కదలికలను చురుగ్గా ఉంచడం ద్వారా మలబద్ధకాన్ని నివారించడంలోనూ, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోటాకు మద్దతు ఇవ్వడంలోనూ సహాయపడుతుంది. వీటిని రోజూ తింటే పోషకాల గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. శరీరంలో వ్యర్థాలు తొలగిస్తుంది.

యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్..

శరీర కణాలకు నష్టం చేకూర్చే ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఖర్జూరంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..

ఖర్జూరాలలో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఈ కారణంగా రక్తపోటును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పొటాషియం రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!


కృత్రిమ చక్కెరలకు ప్రత్యామ్నాయం..

సహజ చక్కెరలు కలిగి ఉన్న కారణంగా ఖర్జూరాలు శుద్ధి చేసిన చక్కెరలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. ఖర్జూరంలోని సహజ చక్కెరలు ఫైబర్‌తో కలిసి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నియంత్రిస్తాయి. కృత్రిమ చక్కెరలకు బదులుగా వివిధ తీపి ఆహారాల తయారీలో ఖర్జూరాలను ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: Nutmeg: వంటల్లో వాడే జాజికాయ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా? రోజూ చిటికెడు పొడిని తింటే..!


(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడంల మంచిది.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 01:11 PM