Curd rice: చలికాలం కదా అని పెరుగన్నం మానేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!
ABN , Publish Date - Dec 27 , 2023 | 03:25 PM
చలికాలంలో పెరుగన్నం తినేవారు చాలా తక్కువ. కానీ చలికాలంలో దీన్ని తప్పకుండా ఎందుకు తినాలంటే..
పెరుగు పాల ఆధారిత పదార్థం. సాంప్రదాయ భోజనం చివరగా పెరుగన్నం తినడంతో ముగుస్తుంది. సాధారణ రోజుల్లో పాలు, పెరుగు విరివిగా వాడతారు. చలికాలం వచ్చేసరికి చాలామంది కాఫీలు, టీలతోనే సరిపెట్టుకుంటారు. పెరుగును టచ్ చేయడం చాలా తక్కువ. కానీ చలికాలంలో పెరుగన్నం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవుతారు. ఇకమీదట అస్సలు మిస్ కాకుండా పెరుగన్నంను రోజూ తింటారు. పెరుగన్నం తినడం వల్ల కలిగే లాభాలేంటంటే..
ప్రోబయోటిక్స్
పెరుగన్నంలో ప్రోబయోటిక్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగులను ప్రోత్సహిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఇది కూడా చదవండి: వెల్లుల్లి పొట్టు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే!
కాల్షియం..
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఎముకలు పెళుసుబారడం, బోలు ఎముకల వ్యాధి మొదలైనవాటిని దరిచేరనివ్వదు.
చల్లగా ఉంటుంది..
పెరుగు తింటే శరీరంలో చలి ఎక్కువ అవుతుందని అందరూ అంటారు. ఇది నిజమే అయినా దీని కారణంగా పెరుగును దూరం పెట్టడం మంచిది కాదు. చలికాలంలో మధ్యాహ్న సమయంలో పెరుగును తింటే చాలా మంచిది. ముఖ్యంగా వేడి శరీరం ఉన్నవారికి పెరుగు బాగా సహాయపడుతుంది. శరీరంలో వేడి తగ్గిస్తుంది.
ప్రోటీన్..
పెరుగు, అన్నం రెండింటిలోనూ పోషకాల కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను భర్తీ చేస్తాయి. ప్రోటీన్ లోపంతో బాధపడేశాఖాహారులు పెరుగును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఆవిరిమీద ఉడికించిన ఆహారం తింటే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
పోషకాల గ్రహింపు..
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ దానితో పాటు ఆహారంలో పోషకాలు గ్రహించడంలో సహాయపడుతుంది. భోజనంలో తీసుకునే పోషకాలు శరీరం గ్రహించేలా చేస్తుంది. దీనివల్ల తిన్న ఆహారంలో పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.
ఉదర సమస్యలు
పెరుగన్నంలో ఉండే ప్రోబయోటిక్స్ ఆహారం బాగా జీర్ణం కావడంలో సహాయపడతాయి. తద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిస్తాయి.
వెయిట్ లాస్..
పెరుగన్నం తృప్తిని కలిగిస్తుంది. దీని కారణంగా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే డైట్ లో పెరుగన్నం తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి: జీలకర్ర నీళ్లు ఇంత పవరా? ఉదయాన్నే తాగితే జరిగేదిదే..!
విటమిన్లు..
పెరుగన్నంలో విటమిన్-బి12, బి6, రిబోప్లావిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తి తయారుకావడానికి, శరీర ఆరోగ్యానికి సహాయపడతాయి.
గుండె ఆరోగ్యం..
పెరుగులోని ప్రోబయోటిక్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Dates: రోజూ ఖర్జూరం తింటే జరిగేదేంటి? ఈ కారణాల లిస్ట్ చూస్తే..!
(గమనిక: ఇది ఆరోగ్య నిఫుణులు, వైద్యులు పలు చోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.