Notification: జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2023-03-08T11:31:03+05:30 IST

జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులు (Junior Civil Judge Posts) (30) భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌

Notification: జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీ
జడ్జి పోస్టుల భర్తీ

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టులు (Junior Civil Judge Posts) (30) భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 24 పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో, మరో ఆరింటిన రిక్రూట్‌మెంట్‌ బై ట్రాన్స్‌ఫర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నెల 17 నుంచి హైకోర్టు (High Court) వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్‌ 6 చివరి తేదీగా పేర్కొన్నారు. పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్‌ 24న కంప్యూటర్‌ ఆధారిత స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌) ఎస్‌.కమలాకర్‌రెడ్డి మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!

Updated Date - 2023-03-08T11:31:03+05:30 IST