ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. 2 నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?

ABN , First Publish Date - 2023-02-13T16:41:26+05:30 IST

చూడముచ్చటైన జంట. ప్రొఫెషనల్ జాబ్స్. పెద్ద అంకెల్లో జీతాలు. ఏ బాధాలేదు. ఏ కష్టం లేదు. వారి జీవితం హాయిగా.. సంతోషంగా సాగిపోతుంది. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. మూణ్నాళ్ల ముచ్చట తీరకుండానే అనంత ఆయువులో కలిసిపోయారు.

ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. 2 నెలల క్రితమే అంగరంగ వైభవంగా పెళ్లి.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?
ఇంతలోనే ఇలా జరిగిందేంటి..?

చూడముచ్చటైన జంట. ప్రొఫెషనల్ జాబ్స్ (Professional Jobs). పెద్ద అంకెల్లో జీతాలు. ఏ బాధాలేదు. ఏ కష్టం లేదు. వారి జీవితం హాయిగా.. సంతోషంగా సాగిపోతుంది. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. మూణ్నాళ్ల ముచ్చట తీరకుండానే అనంత ఆయువులో కలిసిపోయారు.

ఒక్కోసారి అరుదైనవి చూసినప్పుడు గానీ.. విన్నప్పుడు గానీ ఇలాంటి పరిస్థితి మన పగవాడికి కూడా రాకూడదంటారు. ఇంకొంత మంది శత్రువు కూడా సాయం చేయాలే గానీ.. కీడు చేయకూడదంటారు. అవును! ఇదే కదా మానవత్వం అంటే.

ఈడూ.. జోడూ భలే ఉన్నారు అని చెప్పుకునేంత ముచ్చటైన జంట. రెండు నెలల క్రితమే వివాహమైంది. అంగరంగ వైభవంగా పెళ్లి (marriage) జరిగింది. ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి. పైగా వారిద్దరూ సాప్ట్‌వేర్ ఇంజనీర్లు (Software Engineers). బెంగళూరు (Bangalore)లో ఓ ప్రైవేటు కంపెనీ ( private company)లో ఉద్యోగం చేస్తూ అక్కడినే జాలిగా సంసారం సాగిస్తున్నారు. ఇంతలో బంధువుల నుంచి పెళ్లి పిలుపు అందింది. శుభకార్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎంతో ఆనందంగా ఆ ఊసులు.. ఈ ఊసులు చెప్పుకుంటూ ఇద్దరూ కారులో బయలుదేరారు. కానీ అంతలోనే లారీ రూపంలో విధి వెక్కిరించింది. కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన బంధువులను తీవ్రంగా కలిచి వేసింది. ఈ దుర్ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: 16 ఏళ్ల బాలికకు తరచూ వాంతులు.. బక్కగా అయిపోతోందంటూ ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు.. టెస్టులు చేసి అవాక్కైన డాక్టర్లు..

హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన రఘు (35), తుమకూరు జిల్లా తిగడనహళ్లికి చెందిన అనూష(28)తో రెండు నెలల క్రితమే పెళ్లైంది. బళ్లారి (Bellary)లో బంధువుల మ్యారేజ్ (marriage) ఉంటే ఇద్దరూ కారులో వెళ్తున్నారు. అయితే హులియూర్ దగ్గర ఎదురుగా లారీ (lorry) వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు (car) నుజ్జునుజ్జుకావడంతో దంపతులిద్దరికీ తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణవార్త తెలుసుకొన్న బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

couple.jpg

Updated Date - 2023-02-13T16:57:44+05:30 IST