Shameerpet Gun Firing : శామీర్‌పేట గన్‌ఫైరింగ్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఈ వీడియో ఒక్కసారి చూశారో..?

ABN , First Publish Date - 2023-07-15T19:19:05+05:30 IST

హైదరాబాద్‌లోని శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌ విల్లాలో జరిగిన గన్ ఫైరింగ్ (Shameerpet Gun Firing) సంచలనంగా మారింది. ఈ కాల్పుల వ్యవహారంలో ఇప్పటికే అనేక ట్విస్టులు బయటికిరాగా.. తాజాగా ఎవరూ ఊహించని ట్విస్ట్‌ (Twist) ఒక్క వీడియోతో వెలుగులోకి వచ్చింది.!..

Shameerpet Gun Firing : శామీర్‌పేట గన్‌ఫైరింగ్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. ఈ వీడియో ఒక్కసారి చూశారో..?

హైదరాబాద్‌లోని శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌ విల్లాలో జరిగిన గన్ ఫైరింగ్ (Shameerpet Gun Firing) సంచలనంగా మారింది. ఈ కాల్పుల వ్యవహారంలో ఇప్పటికే అనేక ట్విస్టులు బయటికిరాగా.. తాజాగా ఎవరూ ఊహించని ట్విస్ట్‌ (Twist) ఒక్క వీడియోతో వెలుగులోకి వచ్చింది.! ఇప్పటి వరకూ స్మితతో ‘కార్తికదీపం’ సీరియల్ నటుడు మనోజ్‌కు అక్రమ సంబంధం ఉందని.. అందుకే మధ్యలో వచ్చిన స్మిత (Smitha) మాజీ భర్త సిద్ధార్థ్ దాస్‌పై (Siddarth Das) ఫైరింగ్ చేశాడన్న వార్త ఒక్కసారిగా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాల్పులు జరిపిన వ్యక్తి సెలబ్రిటీ కావడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన వార్తలు ఎక్కడ చూసినా వైరల్ అవుతుండటంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను మనోజ్ రిలీజ్ చేశాడు.


Shamirpet.jpg

వీడియోలో ఏముంది..?

హాయ్‌.. నా పేరు మనోజ్ కుమార్ (Manoj Kumar). నేను కార్తికదీపం (Karthika Deepam) సీరియల్‌లో ప్రేమ్‌గా నటించాను.. ఇప్పుడు మౌనపోరాటంలో ద్వారకగా నటిస్తున్నాను. ఇవాళ ఉదయం నుంచి ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. మనోజ్ నాయుడు అనే వ్యక్తి సిద్ధార్థ్ దాస్ మీద గన్ ఫైర్ చేశారని వైరల్ అవుతోంది. ఆ.. మనోజ్ నాయుడు అనే వ్యక్తి నేనే అనుకుని నా ఫొటోలు, వీడియోలు, నా సీరియల్ క్లిప్పింగ్స్‌ను కట్ చేసి పోస్టు చేస్తున్నారు.. న్యూస్‌లో వాడుతున్నారు.. సర్క్యులేట్ చేస్తున్నారు. ఉదయం నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది.. అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాను. నేను బెంగళూరులో ఉన్నాను.. హైదరాబాద్‌లో ఏం జరుగుతోందో నాకు తెలియదు. నాకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మనోజ్ నాయుడు నేను కాదు.. అయినా నా ఫొటోలు, వీడియోలు ఎలా వాడుతారు..?. ఎలాంటి క్రాస్ చెకింగ్ లేకుండా, అనుమతి లేకుండా.. నాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎలా వాడుతున్నారు..?. నాపై ప్రచారం చేసిన వారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటాను.. నాపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మకండిఅని మనోజ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై అభిమానులు స్పందిస్తూ.. మీకు ఏం కాదు ధైర్యంగా న్యాయపోరాటం చేయండని సూచిస్తున్నారు.

karthika-deepam-manoj-kumar.jpg

కాల్పులు జరిపిందెవరు..?

కాగా.. ఇవాళ ఉదయం మనోజ్ నాయుడు అనే వ్యక్తి కాల్పులు జరిపాడంటూ సిద్ధార్థ దాస్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కథ ప్రారంభమైంది. ఈ స్టోరీ అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. స్మితా గ్రంధికి మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు ఉండగా.. భర్తతో విడిపోయింది. అయితే తనకు కుమారుడు, కుమార్తెను అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్‌ న్యాయ పోరాటం చేస్తుండగా.. పిల్లలపై మనోజ్‌ దాడి చేయడంతో ఈ వ్యవహారం ఇక్కడిదాకా వ్చ్చింది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సంరక్షణలో ఉన్నారు. పిల్లలకోసమే సిద్ధార్థ్ హైదరాబాద్‌కు రాగా సెలబ్రిటీ క్లబ్‌లో మనోజ్ తనదగ్గరున్న ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సిద్ధార్థ్‌కు గాయాలయ్యాయి. అయితే.. తన ఫొటోలు అనవసరంగా వాడారని.. మనోజ్ కుమార్ చర్యలు తీసుకుబోతున్నట్లు చెబుతున్నాడు. ఇంతకీ ఆ మనోజ్ నాయుడు ఎవరు..? అతని బ్యాగ్రౌండ్ ఏంటి..? కాల్పులు జరిగాక ఎక్కడికి పారిపోయాడు..? అని పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. స్మితనే తన మాజీ భర్తపై కాల్పులు జరిపారా..? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తెవరు అనేది ఇప్పుడో మిస్టరీగా మారింది. ఫైనల్‌గా పోలీసులు ఏం తేలుస్తారో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


AP Politics : వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలేమో.. ఛీ.. ఛీ.. సిగ్గు పడండి సీఎం..!


TeluguDesam : నారా లోకేష్‌తో చేతులు కలిపిన వైసీపీ యంగ్ ఎంపీ.. ఏదో జరుగుతోందంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ..!


Pawan Kalyan : చింతిస్తున్నా.. అందరి ముందు క్షమాపణలు కోరిన పవన్ కల్యాణ్


BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?


Updated Date - 2023-07-15T19:27:08+05:30 IST