Share News

Wife: 62 ఏళ్ల భార్యను 13 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త.. కారణమేంటా అని పోలీసులు ఆరా తీస్తే..!

ABN , First Publish Date - 2023-12-08T13:21:53+05:30 IST

Crime News: కేరళ రాష్ట్రం అలప్పుజలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా 13 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Wife: 62 ఏళ్ల భార్యను 13 సార్లు కత్తితో పొడిచి చంపిన భర్త.. కారణమేంటా అని పోలీసులు ఆరా తీస్తే..!

Crime News: కేరళ రాష్ట్రం అలప్పుజలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా 13 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుజ పరిధిలోని ములకుజలో రాధ (62), శివన్‌కుట్టీ (68) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ భార్యాభర్తలు తరచూ కుటుంబ విషయమై గొడవపడేవారు. అలా చాలాకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మరోసారి దంపతులు ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన శివన్ కుట్టీ భార్య రాధపై కత్తితో విరుచుకుపడ్డాడు. ఛాతీ, పొట్ట, వీపు భాగంలో విచక్షణరహితంగా కత్తితో 13 సార్లు పొడిచాడు. దాంతో తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కొద్దిసేపటి తర్వాత పొరుగింటివారు ఆమెను రక్తపు మడుగులో పడి ఉండడం చూసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Johnson's Baby Powder: టేస్ట్ బాగుంటుందట.. జాన్సన్ బేబీ పౌడర్‌ను తెగ తినేస్తున్న మహిళ..!

కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ, అప్పటికే శివన్‌కుట్టీ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలించిన పోలీసులకు ఒక చోట ఆచూకీ దొరికింది. తన కోసం పోలీసులు రావడం గమనించిన అతడు వారి నుంచి తప్పించుకోవాలని చూశాడు. దాంతో పోలీసులు శివన్‌కుట్టీని వెంబడించి పట్టుకున్నారు. అతడిపై హత్యనేరం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. గురువారం స్థానిక కోర్టులో హాజరుపరచగా శివన్‌కుట్టీకి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని మావెలిక్కర్ సబ్ జైలుకు తరలించారు. ఈ ఘటన ములకుజలో కలకలం సృష్టించింది. శివన్‌కుట్టీని స్థానికులు ఏం భర్తవయ్యా..? అంటూ తిట్టిపోస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral: 148 దేశాలను చూపిస్తామని రూ.26 లక్షలను తీసుకుని.. చివరకు ఆ మహిళను రోడ్డున పడేశారు..!

Updated Date - 2023-12-08T13:22:49+05:30 IST