Jio 5G: జియో 5జీ ప్లాన్లు ఇవేనా?.. 46వ వార్షిక సమావేశంలో అంబానీ ఏం చెప్పబోతున్నారంటే..?

ABN , First Publish Date - 2023-08-26T18:28:14+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు.

Jio 5G: జియో 5జీ ప్లాన్లు ఇవేనా?.. 46వ వార్షిక సమావేశంలో అంబానీ ఏం చెప్పబోతున్నారంటే..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం(46th RIL AGM 2023) ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ(Reliance Industries Chairman Mukesh Ambani) వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖేష్ అంబానీ ఈ సారి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. జియో ఎయిర్ ఫైబర్ రోడ్‌మ్యాప్, నూతన జియో 5జీ స్మార్ట్‌ఫోన్ వంటి కీలక వివరాలను అంబానీ ఈ సారి వెల్లడించనున్నారని సమాచారం. ముఖ్యంగా జియో 5జీ భవిష్యత్, టారిఫ్ ప్లాన్‌లు, జియో స్మార్ట్ ఫోన్‌ల(JioAir Fiber roadmap, a new 5G Jio smartphone) గురించి అంబానీ మాట్లాడే అవకాశాలున్నాయి. దీంతో వినియోగదారుల్లో జియో 5జీ అఫర్‌లు ఎలా ఉండబోతున్నాయననే ఆసక్తి నెలకొంది. మరోవైపు రిలయన్స్ జియో ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాలకు 5జీ నెట్‌వర్క్‌ సేవలను విస్తరించింది. 2024 నాటికి పూర్తి స్థాయిలో జియో 5జీ సేవలను అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న 7,500 కంటే ఎక్కువ ప్రాంతాలు, జిల్లాలు, నగరాలకు 5జీ కవరేజీని కంపెనీ విస్తరిస్తోంది.


ఇప్పటివరకు జియో.. 5జీ సేవలను(Jio 5G service) అందించడానికి ఇప్పటికే ఉన్న 4జీ ప్లాన్‌లను ఉపయోగించుకుంది. కాగా కంపెనీ ఈ ఈవెంట్‌ని 5జీ టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించడానికి వేదికగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. 5జీ టారిఫ్ ప్లాన్‌లను(Jio 5G tariff plans) సరసమైన ధరలలో అందుబాటులో ఉంచుతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఒక జీబీ(GB) డేటాకు రూ.300 వరకు ఖర్చవుతుంది. కానీ దానిని రూ.10కి తగ్గించారు. మన దేశంలో సగటున ఒక మనిషి నెలలో 14 జీబీ డేటా వినియోగిస్తున్నాడు. దీని కోసం సాధారణంగా నెలకు రూ.4,200 ఖర్చవుతుంది. కానీ దానిని రూ.125 నుంచి రూ.150 తగ్గించారు. దీనికి ప్రభుత్వం చేసిన ప్రయత్నమే కారణమని ఇటీవల ప్రధాని మోదీ(Prime Minister Modi) చెప్పారు. జియో 5జీ టారిఫ్ ప్లాన్‌లు ప్రపంచంలోని ఏ టెలికాం కంపెనీతో పోల్చినా తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని గత సంవత్సరం అంబానీ ప్రకటించారు. 5జీ టారిఫ్ ప్లాన్ ధరలు, 4జీ ప్లాన్(4G plans) ధరలకు సమానంగా ఉంటాయని ఎయిర్‌టెల్‌లోని(Airtel) ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ప్రస్తుతం జియో వినియోగదారులు ఆన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోసం రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన 5జీ ప్లాన్ ధరలు కూడా ఇదే స్థాయిలో ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే ఈ నెల 28న అంబానీ అధికారిక ప్రకటన చేసే వరకు ఎదురుచూడాల్సిందే.

Updated Date - 2023-08-26T18:43:15+05:30 IST