RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

ABN , First Publish Date - 2023-09-13T16:33:57+05:30 IST

వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్‌బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్‌ను ప్రవేశపెట్టింది.

RBI new rule: ఆర్బీఐ కొత్త రూల్.. బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే కస్టమర్‌కి రోజుకు రూ.5 వేలు చెల్లించాల్సిందే..

ముంబై: వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్‌బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్‌ను ప్రవేశపెట్టింది. రుణగ్రహీత లోన్‌ను పూర్తిగా చెల్లించాక, అతడి వ్యక్తిగత లోన్ అకౌంట్‌ను క్లోజ్ చేసిన తర్వాత ఖాతాదారుడికి సంబంధించిన స్థిర లేదా చరాస్థుల డాక్యుమెంట్లను ఇచ్చేయాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశం జారీ చేసింది. ఆలస్యమైతే రోజుకు రూ.5000 చొప్పున రుణగ్రహీతకు బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన డిసెంబర్ 1, 2023 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.


ఈ కొత్త నిబంధనపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజాయితీగా లోన్లు చెల్లించే రుణగ్రహీతల ప్రయోజనాలు రక్షించడమే లక్ష్యంగా.. లోన్ చెల్లింపు తర్వాత డాక్యుమెంట్లు తిరిగివ్వడంలో ఆర్బీఐ మార్గదర్శకాలు ఉపయుక్తంగా ఉంటాయని స్టేబుల్‌ఇన్వెస్టర్ సంస్థ వ్యవస్థాపకుడు, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ దేవ్ ఆశీష్ అభిప్రాయపడ్డారు. సకాలంలో రుణ చెల్లింపులు చేసినప్పటికీ ఆ తర్వాత జరగాల్సిన క్లోజింగ్ దశలో అసమంజసం కాని విధంగా ఆలస్యం చేస్తున్నారని అన్నారు.


కాగా.. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సహా అన్ని కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయి. అన్ని ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంకులు, అన్ని స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు, అన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, అన్ని అసెట్ రీకన్‌స్ట్రక్చన్ కంపెనీలకు వర్తిస్తాయి.

Updated Date - 2023-09-13T16:33:57+05:30 IST