Peethala Sujatha: చిన్న వయసులోనే తారకరత్న ఆకాల మరణం బాధాకరం

ABN , First Publish Date - 2023-02-20T18:09:40+05:30 IST

సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నందమూరి తారకరత్న (Tarakaratna) చిన్న వయసులోనే మరణించడం ఆ కుటుంబానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి

Peethala Sujatha: చిన్న వయసులోనే తారకరత్న ఆకాల మరణం బాధాకరం
ఆకాల మరణం బాధాకరం

ఏలూరు: సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నందమూరి తారకరత్న (Tarakaratna) చిన్న వయసులోనే మరణించడం ఆ కుటుంబానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి (TDP) మరియు నందమూరి అభిమానులకు తీరని లోటని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఆయన ఆస్పత్రి నుంచి పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని ఎదురు చూశామని దానికి అన్ని రకాల వైద్య సేవలు కూడా చంద్రబాబు (Chandrababu), బాలకృష్ణ (Balakrishna) దగ్గర ఉండి పర్యవేక్షణ చేశారని తెలిపారు. విదేశాల నుంచి కూడా వైద్యులను రప్పించి అధునాతన చికిత్స అందించారని వివరించారు. అయినాసరే ఫలితం లేకుండా పోయిందని ఆమె వాపోయారు. ఇంత చిన్న వయసులోనే తన మంచితనం, చెరగని చిరునవ్వుతో అనేకమంది అభిమానులను తారకరత్న సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాని పీతల సుజాత సంతాపం వెలిబుచ్చారు.

Updated Date - 2023-02-20T18:10:41+05:30 IST