Lokesh YuvaGalam: 202వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-09-02T10:05:25+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 202వ రోజుకు చేరుకుంది. శనివారం గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. మరికాసేపట్లో గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తికానుంది. అక్కడి నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఉంగుటూరులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు.

Lokesh YuvaGalam: 202వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

పశ్చిమ గోదావరి: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 202వ రోజుకు చేరుకుంది. శనివారం గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. మరికాసేపట్లో గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తికానుంది. అక్కడి నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఉంగుటూరులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు. ఇప్పటి వరకు లోకేశ్ 2730 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు 20.3 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.


యువగళం పాదయాత్ర వివరాలు:

ఉదయం

8:00 – ప్రకాశరావుపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8:20 – ఆవపాడులో స్థానికులతో మాటామంతీ.

9:50 – సింగరాజుపాలెంలో ఎస్సీ సామాజకవర్గీయులతో సమావేశం.

10:30 – పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.

10:50 – నీలాద్రిపురంలో స్థానికులతో మాటామంతీ.

11:05 – నీలాద్రిపురంలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.

12:35 – ఉంగుటూరులో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.

1:35 – ఉంగుటూరులో భోజన విరామం.

సాయంత్రం

4:00 – ఉంగుటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4:30 – ఉంగుటూరు సెంటర్ లో బిసి సామాజికవర్గీయులతో భేటీ.

5:30 – నారాయణపురం శివాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.

5:50 – నారాయణపురం ఐసిఐసిఐ బ్యాంకు వద్ద ఎస్సీలతో సమావేశం.

7:50 – చిననిండ్రకొలను శివార్లలో స్థానికులతో మాటామంతీ.

8:20 – చిననిండ్రకొలను సెంటర్ లో ఆక్వారైతులతో సమావేశం.

8:30 – చిననిండ్రకొలను విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-09-02T10:05:25+05:30 IST