Cyber ​​Hackers: హరిరామ జోగయ్య పేరుతో సైబర్ వల! మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన జానారెడ్డి

ABN , First Publish Date - 2023-07-11T16:03:55+05:30 IST

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను కూడా సైబర్ కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. జోగయ్య పేరు మీద పలువురికి కేటుగాళ్లు ఫోన్లు చేశారు. డబ్బు అవసరం ఉందని.. కొంత డబ్బు పంపాలంటూ జోగయ్య అడిగినట్లుగా పలువురికి ఫోన్లు చేశారు.

Cyber ​​Hackers: హరిరామ జోగయ్య పేరుతో సైబర్ వల! మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన జానారెడ్డి

పశ్చిమగోదావరి జిల్లా: కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను (Harirama jogaiah) కూడా సైబర్ కేటుగాళ్లు వదిలిపెట్టలేదు. జోగయ్య పేరు మీద పలువురికి కేటుగాళ్లు ఫోన్లు చేశారు. డబ్బు అవసరం ఉందని.. కొంత డబ్బు పంపాలంటూ జోగయ్య అడిగినట్లుగా పలువురికి ఫోన్లు చేశారు. వారి వలలో చిక్కుకుని మాజీ మంత్రి జానారెడ్డి (Janareddy) తొమ్మిది వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశారు. అలాగే రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రావు కూడా మరి కొంత సొమ్ము పంపారు. ఈ ఘటనలతో హరిరామ జోగయ్య అప్రమత్తం అయ్యారు. తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జోగయ్య బహిరంగ లేఖ రాశారు. అంతేకాకుండా ఇదే విషయంపై ఫోన్ ద్వారా పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-07-11T16:05:14+05:30 IST