TDP: ఈసారి జగన్‌కు ఓటేస్తే జరిగేది అదే..!
ABN , First Publish Date - 2023-06-28T17:28:11+05:30 IST
ప్రజలు జగన్‌కు ఓటు వేస్తే నేరాల నుంచి.. శిక్షల నుంచి తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లే. జగన్ ఒక సెంటు స్థలం ఇచ్చారు. ఒక సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటారు?. ప్రజల నుంచి దోచుకున్న ఆదాయం జగన్ ఇంటికి.. జగన్ చేసిన అప్పులు మన ఇంటికి. ఈ దుర్మార్గపు పాలన పోవాలంటే
విశాఖ: వైసీపీ సర్కార్‌పై (YCP Government) తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత (Vangalapudi Anitha) మండిపడ్డారు. చైతన్య బస్సు యాత్ర సభలో ఆమె మాట్లాడారు. ‘‘నాలుగేళ్ల జగన్ పాలనలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. నవరత్నాల పథకాల ఖర్చుల భారo ప్రజలపైనే వేస్తున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గంజాయి మత్తులో అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఉపాది లేక యువత గంజాయికి దగ్గర కావడానికి జగనే కారణం. గన్ లైసెన్స్‌కు ఒక మంత్రి దరఖాస్తు చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. దళితులకూ రక్షణ లేకుండా పోయింది. హత్యలు జరుగుతున్నా జగన్‌కు పట్టడంలేదు.’’ అని అనిత ధ్వజమెత్తారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ...
‘‘ప్రజలు జగన్‌కు ఓటు వేస్తే నేరాల నుంచి.. శిక్షల నుంచి తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లే. జగన్ ఒక సెంటు స్థలం ఇచ్చారు. ఒక సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటారు?. ప్రజల నుంచి దోచుకున్న ఆదాయం జగన్ ఇంటికి.. జగన్ చేసిన అప్పులు మన ఇంటికి. ఈ దుర్మార్గపు పాలన పోవాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలి.’’ అని ప్రజలకు బండారు సత్యనారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్సీ చిరంజీవి రావు..
‘‘ఏపీ సంక్షేమంలో లేదు.. సంక్షోభంలో ఉంది. ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అప్పుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. జగన్ తన బినామీలకు కాంట్రాక్టులు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఉద్దేశించిన ఏ ఒక్క శాశ్వత పథకమైనా జగన్ ప్రవేశపెట్టారా?.’’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు ప్రశ్నించారు.