Share News

TDP : స్కిల్ కేసులో అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారు

ABN , First Publish Date - 2023-11-20T20:29:04+05:30 IST

తెలుగుదేవం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బెయిల్ రావడంతో విశాఖ లో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేశారు.

TDP : స్కిల్ కేసులో అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారు

విశాఖపట్నం: తెలుగుదేవం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బెయిల్ రావడంతో విశాఖ లో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పెద్దగదిలి జంక్షన్ వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రావడం ఆనందంగా ఉంది. సైకో జగన్ చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, గెలిచింది. రానున్న ఎన్నికలల్లో రాష్ట్ర ప్రజలు సైకో జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు తెలిపారు.

Updated Date - 2023-11-20T20:29:15+05:30 IST