Share News

Gopinath Reddy: T20 మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

ABN , First Publish Date - 2023-10-27T17:03:11+05:30 IST

విశాఖపట్నంలో T20 మ్యాచ్ ( T20 Match ) కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపినాథ్‌రెడ్డి ( Gopinath Reddy ) వ్యాఖ్యానించారు.

Gopinath Reddy: T20 మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

విశాఖపట్నం: విశాఖపట్నంలో T20 మ్యాచ్ ( T20 Match ) కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గోపినాథ్‌రెడ్డి ( Gopinath Reddy ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘దిలీప్ ట్రోఫీలో ఒక స్టేట్ నుంచి నలుగురు ప్లేయర్లు ఆడిన ఘనత ఆంధ్రకే దక్కుతుంది. హనుమ విహారి, కేఎస్ భరత్, రిక్కీ భువి, శశికాంత్ ఆడారు. ఐపీఎల్‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్లేయర్లను సెలెక్ట్ చేశారు. వారికి టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర నుంచి ఆడేవారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు బీసీసీఐ కూడా ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 2వ తేదీన ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ విశాఖలో జరగబోతుంది. ఇన్ని టోర్నీలు నిర్వహిస్తున్నాం అంటే మా స్టాఫ్ కృషి చాలా ఉంది. ఉమెన్ T20 లీగ్ చేసిన ఫస్ట్ స్టేట్ మనది. డిసెంబర్ నెలలో లెజెండ్ లీగ్ విశాఖలో జరగబోతుంది. క్రిస్‌గేల్, గంబీర్, షేన్ వాట్సాన్, ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖపట్నంలో మ్యాచ్‌లు ఆడబోతున్నారు. ఇన్ని మ్యాచ్‌లు విశాఖపట్నానికి తీసుకొని రావడానికి చాలా కష్టపడ్డాం. ఈ మ్యాచెస్ చూసేందుకు విద్యార్థులకు ఫ్రీ గా పాసులు ఇవ్వబోతున్నాం. సెలెబ్రేటీ క్రికెట్ లీగ్ మళ్లీ విశాఖలో జరగబోతుంది. T20 మ్యాచ్ కోసం బీచ్ రోడ్డులో స్క్రీన్స్ పెడుతున్నాం. దేశంలో ఉన్న అన్ని స్టేడియంల కంటే విశాఖపట్నం స్టేడియంలో రేట్లు తక్కువ. బీసీసీఐ ఇచ్చిన paytm కే టికెట్స్ విక్రయాలు ఇస్తున్నాం. నిజమైన క్రికెట్ అభిమానులకు టికెట్స్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. గతంలో టికెట్స్ లోకల్ వాళ్లకు ఇవ్వడంలో సక్సెస్ అయ్యాం. స్టేడియంలో కూర్చోడానికి 7 వేల కొత్త చైర్స్ తీసుకొచ్చాం’’ అని గోపినాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-10-27T17:03:11+05:30 IST