Share News

YuvaGalam: కాకినాడలో జనజాతరను తలపిస్తున్న యువగళం

ABN , First Publish Date - 2023-12-01T15:18:59+05:30 IST

Nara lokesh: నగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనజాతరను తలపిస్తోంది. కాకినాడ నగరంలో యువగళానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

YuvaGalam: కాకినాడలో జనజాతరను తలపిస్తున్న యువగళం

కాకినాడ: నగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జనజాతరను తలపిస్తోంది. కాకినాడ నగరంలో యువగళానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సినిమారోడ్డులో యువగళం పాదయాత్ర జనజాతరను తలపిస్తోంది. యువనేత లోకేష్‌కు స్వాగతం పలుకుతూ అడుగడుగునా ఫ్లెక్సీలు వెలిశాయి. గజమాలలు ఏర్పాటు చేశారు. యువగళం జెండాలు చేతబూని టీడీపీ - జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతున్నారు. జనం భారీగా రోడ్లపైకి వచ్చి లోకేష్‌ యువగళంలో పాల్గొంటున్నారు. మహిళలు హారతులతో నీరాజనాలు పడుతున్నారు. సైకో పోవాలి – సైకిల్ రావాలంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

Updated Date - 2023-12-01T15:19:01+05:30 IST