Sajjala: చంద్రబాబును సునీత ఎందుకు కలిశారు.. వివేకా హత్య కేసును రాజకీయంగా టీడీపీ వాడుకోవాలని చూస్తోంది

ABN , First Publish Date - 2023-04-18T20:01:43+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu), టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (AP government advisor Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sajjala: చంద్రబాబును సునీత ఎందుకు కలిశారు.. వివేకా హత్య కేసును రాజకీయంగా టీడీపీ వాడుకోవాలని చూస్తోంది

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu), టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (AP government advisor Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అజెండాగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును (YS Vivekananda Reddy murder case) వాడుకోవాలని టీడీపీ చూస్తుందని, టీడీపీ నేతలు, చంద్రబాబును సునీత ఎందుకు కలవాల్సి వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ఏం చేసింది చెప్పుకోవడానికి ఏమి లేదని సజ్జల విమర్శించారు. వివేకా హత్య కేసులో ఉన్న హంతకుడు దస్తగిరి మాటలను ఒక వర్గం మీడియాలో పతాక శీర్షికలో ప్రచారం చేస్తున్నారని మండిడ్డారు. దస్తగిరికి రక్షణ కావాలి అంటే ప్రభుత్వం రక్షణ కల్పించిందని, అలాంటి వ్యక్తి నోటికి వచ్చినట్లు ఏడాపేడా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకానంద రెడ్డి పార్టీలో పెద్ద దిక్కుగా ఉండి అవినాష్ రెడ్డికి, ఇతర నాయకులకు మద్దతుగా ఉన్నారని, సీబీఐ దర్యాప్తులో వాళ్లకు కావాల్సింది రాసుకుంటున్నారని, దర్యాప్తు పేరుతో డ్రామా నడిపిస్తున్నారని విమర్శించారు. ముందే నిర్ణయించుకొని ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం రామ్ సింగ్ చేశారని, సుప్రీంకోర్టు అందుకే రాం సింగ్‌ను విచారణ నుంచి తప్పించిందన్నారు. కొత్త టీం వచ్చి నెల రోజుల్లో కొత్తగా ఎవరినైనా విచారించారా? అని, అంతకుముందు లేని భాస్కర్ రెడ్డి.. నిందితుడు ఎలా అయ్యారు?. అవినాష్ రెడ్డి సహా నిందితుడు ఎలా అయ్యారని సజ్జల ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై కేసు నిలబడదని, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆత్మ విశ్వాసంతో ఉన్నారని సజ్జల తెలిపారు.

జగన్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినట్లు... ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టవచ్చని, న్యాయస్థానంలో కేసు నిలబడదన, వాచ్‌మెన్ రంగన్న నిందితులు ఎవరో చెబుతుంటే... ఇంకా అప్రూవర్ అవసరం ఏమొచ్చిందని, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-18T20:05:39+05:30 IST