Anam: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనంకు ఏయే పార్టీలు గాలం వేస్తున్నాయంటే...

ABN , First Publish Date - 2023-02-04T14:57:24+05:30 IST

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి పలు పార్టీల నుంచి బంపర్ ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నట్లు తెలియవచ్చింది.

Anam: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనంకు ఏయే పార్టీలు గాలం వేస్తున్నాయంటే...

నెల్లూరు: వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (YCP MLA Anam RamaNarayana Reddy)కి పలు పార్టీల నుంచి బంపర్ ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నట్లు తెలియవచ్చింది. ఆనంను బీజీపీ (BJP)లోకి తీసుకెళ్లేందుకు పార్టీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేషీ (Union Home Minister Amit Shah Peshi), సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు (Central Intelligence Officers) ...ఆనం గురించిన వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (BJP Leader Somu Veerraju) ఫోనులో సుధీర్ఘ చర్చలు సాగించినట్లు సమాచారం. ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ నేతలు పట్టుపట్టడంతో ఆనంతో బీజేపీ నేతలు (BJP Leaders) వరస చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఆనంకు భద్రత పెంచాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జనసేన (Janasena)లోకి రావాలని నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా అనుచరులతో వరస సమీక్షల అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ఆనం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కాగా... ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి... అధిష్టానం వేటుకు గురయ్యారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవి నుంచి ఆనంను తొలగించిన అధిష్టానం ఆ పదవిని నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి (Nedurumalli Ramkumar Reddy)కి అప్పగించింది. ఈ క్రమంలో వైసీపీ దూరంగా ఉంటూ వస్తున్న ఆనం ఇటీవల అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరో రెండు నెలల్లో మహత్తర కార్యాయానికి శ్రీకారం చుట్టినట్లు సూచనలు చేశారు. అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వెంకటగిరి టీడీపీ (TDP)కి చాలా బలమైన నియోజకవర్గమని... టీడీపీనే చాలాసార్లు గెలిచిందని చెప్పుకొచ్చారు. వెంకటగిరి మునిసిపల్ ఎన్నికల్లో ఎంతో కష్టపడితే, కేవలం రెండు వేల ఓట్లు మెజారిటీ మాత్రమే వచ్చిందని తెలిపారు. తనను అధిష్టానం నుంచి పిలిచే వారు ఎవరూ లేరని.. పిలిచినా వారి ముందు చేతులు కట్టుకుని సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని ఆనం పేర్కొన్నారు.

ఈ క్రమంలో అధిష్టానంతో అంటీముట్టనట్టు ఉంటూ వస్తున్న ఆనం... భవిష్యత్ కార్యచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, జనసేన పార్టీల నుంచి పిలుపు వస్తే ఆనం అడుగు ఎటుపడుతుందో వేచి చూడాలి.

Updated Date - 2023-02-04T14:57:25+05:30 IST